• October 28, 2021

Jabardasth Avinash:పెళ్లైన తరువాత మొదటి సారి అలా.. జబర్దస్త్ అవినాష్ జోరు మామూలుగా లేదు

Jabardasth Avinash:పెళ్లైన తరువాత మొదటి సారి అలా.. జబర్దస్త్ అవినాష్ జోరు మామూలుగా లేదు

    Jabardasth Avinash జబర్దస్త్ అవినాష్ ప్రస్తుతం మంచి జోరు మీదున్నాడు. అక్టోబర్ 20న గ్రాండ్‌గా హైద్రాబాద్‌లో పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లికి బిగ్ బాస్ కంటెస్టెంట్లు, బుల్లితెర తారలు వచ్చారు. ఒకే చోట బిగ్ బాస్ కంటెస్టెంట్లు, జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు కనిపించడంతో పెళ్లంతా సందడిగా మారింది. అయితే ఇప్పుడు జబర్దస్త్ జోరు మీదున్న అవినాష్ తన భార్యతో కలిసి బయటకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది.

    అక్టోబర్ 20న పెళ్లి, 24న గ్రాండ్ రిసెప్షన్ చేసుకున్న అవినాష్ సోషల్ మీడియాలో హంగామా చేశాడు. తన సొంతూరు జగిత్యాలలో అవినాస్ రిసెప్షన్ వేడుకలను నిర్వహించాడు. ఆ ఈవెంట్‌కు చమ్మక్ చంద్ర, తాగుబోతు రమేష్ వంటి వారు వచ్చారు. పెళ్లికి హాజరు కాలేని వారు అలా రిసెప్షన్‌లో కనిపించారు. కానీ శ్రీముఖి మాత్రం ప్రతీ ఈవెంట్‌లో ఉంది.

    మెహెందీ, హల్దీ, పెళ్లి, రిసెప్షన్ ఇలా ప్రతీ ఒక్క చోట శ్రీముఖి కనిపించింది. అలా మొత్తానికి పెళ్లి పనులన్నీ ముగిసినట్టు కనిపిస్తున్నాయి. భార్యతో ప్రశాంతంగా అలా అవినాష్ షికారుకెళ్లినట్టున్నాడు. పెళ్లి తరువాత భార్యతో మొదటి సెల్ఫీ అంటూ మురిసిపోయాడు. ప్రస్తుతం ఈ సెల్ఫీలో అవినాష్ కళకళలాడిపోతోన్నాడు. భార్యతో అలా జర్నీ చేస్తున్నట్టు చెప్పేశాడు.

    Leave a Reply