• October 28, 2021

Mano-Suma: యాంకర్ సుమ మీద దారుణమైన ఆరోపణలు.. ఫోన్ కాల్‌తో సింగర్ మనో గుట్టు రట్టు

Mano-Suma: యాంకర్ సుమ మీద దారుణమైన ఆరోపణలు.. ఫోన్ కాల్‌తో సింగర్ మనో గుట్టు రట్టు

    Mano-Suma యాంకర్ సుమ, సింగర్ మనోలు బుల్లితెరపై చేసే రచ్చ అంతా ఇంతా కాదు. స్వరాభిషేకంలోనూ యాంకర్‌గా సుమ, సింగర్‌గా మనో స్టేజ్ మీదున్నప్పుడు ఎంత సరదాగా పంచులు వేసుకుంటారో అందరికీ తెలిసిందే. ఇక మనో ఇప్పుడు జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ బుల్లితెర మీద కూడా నానా రకాలుగా సంపాదించేస్తున్నారు. అలా స్పెషల్ షోలు, స్కిట్లు అంటూ దుమ్ములేపుతున్నాడు. తాజాగా సుమ మీద మనో ఆరోపణలు చేశాడు. ఫోన్ కాల్‌తో అసలు విషయం బయటపడింది.

    తాజాగా సింగర్లందరూ కూడా స్టార్ట్ మ్యూజిక్ అనే షోలు గెస్టులుగా వచ్చారు. వచ్చే ఆదివారం రాబోతోన్న ఈ షోలో సింగర్లు రచ్చ రచ్చ చేశారు. అయితే ఇదే క్రమంలో సింగర మనోను లైన్‌లోకి తీసుకున్నారు. శ్రావణ భార్గవి సింగర్ మనోకు ఫోన్ చేసింది. కానీ స్పీకర్లో పెట్టిన విషయాన్ని మాత్రం ఆయనకు చెప్పలేదు. అది తెలియన మనో.. ఇష్టమొచ్చినట్టుగా నోటికొచ్చినట్టు వాగేశాడు.

    ఈ క్రమంలో సుమ మీద దారుణమైన ఆరోపణలు చేశాడు. ఆమెకు వయసు అయిపోయింది.. గంటలో అయిపోయే షూటింగ్‌ను రెండు మూడు గంటలు చేస్తోంది.. రెస్ట్ తీసుకుంటుంది ఎక్కువగా.. ఆమెకు చాదస్తం ఎక్కువైంది అని అంటాడు.తిండి తినటం మానేసింది.. నిద్ర పట్టడం లేదు.. బాగా డబ్బులు సంపాదిస్తోంది.. అని అంటాడు. డౌట్ వచ్చిన మనో.. ఫోన్ స్పీకర్లో లేదు కదా? అని అంటాడు. ఆ లేదు సర్ అని శ్రావణ భార్గవి తెగ నటిస్తుంది.

    Leave a Reply