- November 11, 2021
షోలో అందరి ముందే ముద్దు!.. ఆశ్చర్యపోయిన హిమజ

బుల్లితెరపై ఈ మధ్య ఏదైనా పండుగల వస్తే చాలు ఈవెంట్లతో దంచి కొడుతున్నారు. ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు ఇలా ఒక్క చానెల్ అని కాదు. ప్రతీ ఒక్క చానెల్ కూడా పండుగలకు పోటీ మరి స్పెషల్ షోలు చేస్తోంది. ఇప్పుడు చివరకు కార్తీక మాసం అంటూ కూడా ఓ షో చేసింది ఈటీవీ. వినోద భోజనంబు అంటూ చేసిన ఈ షోలో బిగ్ బాస్ కంటెస్టెంట్లు, సింగర్లు నానా హంగామా చేసింది. సింగర్స్ ఫ్యామిలీ అంతా ఒక వైపు.. బిగ్ బాస్ కంటెస్టెంట్లంతా ఒక వైపు ఉన్నట్టు కనిపిస్తోంది.
ఇక ఈ షోకు వెరైటీగా రవికృష్ణ, హిమజలు హెస్ట్‌లుగా వ్యవహరించారు. అయితే రవికృష్ణ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ హిమజ మాత్రం మెప్పించింది. సింగర్లపై పంచులు, వారు హిమజపై వేసిన కౌంటర్లు అన్నీ కూడా బాగానే పేలాయి. అందరూ మంచి ఫాంలో ఉన్నారు కదా? అని హిమజ అంటుంది. ఇలాంటి ఈవెంట్ ఏర్పాటు చేశాక.. ఫాంలో కాకుండా ఫాం హౌస్‌లో ఉంటామా? అని సింగర్ ధనుంజయ్ కౌంటర్ వేశాడు. ఆకలి అవుతుంది ఫుడ్ ఎక్కడుందిరా? అని రవికృష్ణను హిమజ అడుగుతుంది.
తినడానికి వచ్చావా? ఈవెంట్ చేయడానికి వచ్చావా? అని కౌంటర్ వేస్తాడు. అయినా సరే వినిపించుకోకుండా ఏమైనా తినడానికి ఇవ్వండి అని అంటుంది. కనీసం కల్పన అక్క మీరైనా ఏదైనా పెట్టండి అని అంటుంది. అలా హిమజ అనడంతోనే.. వచ్చి బుగ్గ మీద ముద్దు పెడుతుంది. ఇదేంటి? అని హిమజ ఆశ్చర్యపోతుంది. నువ్వే కదా? ఏమైనా పెట్టు అని అన్నావ్.. అందుకే ముద్దు పెట్టాను అని కల్పన కౌంటర్ వేస్తుంది.
సరే కానీ తినడానికి ఏమైనా పెట్టండి అని హిమజ అంటే.. అది కూడా ఉంది. కానీ అది నీ ఊహకు కూడా అందదు అని కల్పన అంటుంది. అవునా ఊహకే అందకపోతే.. శ్రీకాంత్ గారికి అందుతుందేమో అడిగి చూస్తాను అని హిమజ వేసిన పంచుకు అక్కడి నుంచి అందరూ వెళ్లిపోతారు.