- November 11, 2021
ఇండస్ట్రీలో చిరంజీవి ‘భోళా శంకరుడు’.. మెహర్ రమేష్ కామెంట్స్

మెహర్ రమేష్ ప్రస్తుతం చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్నాను అనే ఎగ్జైట్మెంట్‌లో ఉన్నాడు. అసలే ఏడాదిన్నరకు పైగా ఈ స్క్రిప్ట్ మీద కూర్చుడట. ఎక్కడా కూడా రీమేక్ ఛాయలు కనిపించకుండా.. ఒరిజినల్ తెలుగు సినిమాలనే అనిపించేందుకు చాలానే మార్పులు చేర్పులు చేశాడట. నేడు ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. లాంఛనంగా నేడు ప్రారంభించగా.. నవంబర్ 15న సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది.
అయితే పూజా కార్యక్రమాల అనంతరం మెహర్ రమేష్ మాట్లాడాడు. ఏడాదిన్నర కష్టపడి రెడీ చేశాం.. అనిల్ గారు, నేను కలిసి మొదట చిరంజీవిని కలిసినప్పుడు ఎంత ఎనర్జీతో ఉన్నామో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. సత్యానంద్ గారి ఆధ్వర్యంలో స్క్రిప్ట్ వర్క్ చేశాం. ఇది మంచి కథ, సిస్టర్ సెంట్రిక్ కథ. రామారావు గారు నన్ను కన్నడలో దర్శకుడిగా పరిచయం చేశారు. బాస్ సినిమాతొ మళ్లీ ఇలా కలవడం ఆనందంగా ఉంది. చిరంజీవి గారితో ఎన్నెన్నో బ్లాక్ బస్టర్లు తీశారు. ఆయనతో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. చిరంజీవి గారితో సినిమా చేయాలనేది నా డ్రీమ్. ఇన్నేళ్య గ్యాప్ తరువాత మంచి కథతో రావాలి.. చిరంజీవితో కలిసి రావాలని అనుకున్నాను.
నా శక్తినంతా ఇందులో పెడతాను. కమర్షియల్‌గా అందరికీ నచ్చేలా చేస్తాను. తమన్నా చాలా బిజీగా ఉంది. ఎన్నో సినిమాలు చేస్తోంది. సిస్టర్ పాత్రకు కీర్తి సురేష్ ఓకే అయ్యింది. అయితే కథ చెప్పేటప్పుడే తమన్నా అని అందరికీ చెప్పాను. ఎలా అయినా సరే మాకు డేట్స్ ఇవ్వమని తమన్నాను అడిగాం. ఇందులో సాంగ్స్ ప్రత్యేకంగా ఉండబోతోన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్‌గా సాగర్‌ని అనుకున్నాను అంటే.. అనిల్ గారు, చిరంజీవి గారు వెంటనే ఓకే చెప్పారు. ఇండస్ట్రీలో అందరూ అన్నయ్యను భోళా శంకర్ అని అంటారు.కరోనా సమయంలో సీసీసీ అంటూ ఎంత మంద సాయం చేశారో అందరికీ తెలిసిందే. ఆయన పేరులో శంకర్ కూడా ఉంటుంది. ఈ టైటిల్ పెట్టడంతో వైబ్రేషన్స్ మారిపోయాయని అన్నాడు.