- November 7, 2021
HBD Anushka Shetty : నువ్ ఎప్పుడూ నాకు ఇష్టమైన దానివే.. అనుష్కపై బుల్లితెర నటి చైత్రా రాయ్
స్వీటీ అనుష్క శెట్టి బర్త్ డే నేడు (నవంబర్ 7). ఈ క్రమంలో సెలెబ్రిటీలంతా కూడా అనుష్కకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. బర్త్ డే స్పెషల్‌గా నేడు కొత్త సినిమా ప్రకటను చేశారు. యూవీ క్రియేషన్స్‌లో కొత్త సినిమాను అనౌన్స్ చేసింది స్వీటి. ఇది వరకు మిర్చి, భాగమతి వంటి బ్లాక్ బస్టర్లను కొట్టేసింది అనుష్క. అలా ముచ్చటగా మూడో సారి యూవీ క్రియేషన్స్‌తో అనుష్క చేస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రకటన ఇప్పుడు వైరల్ అవుతోంది.
అనుష్క మీద బుల్లితెర నటి చైత్రా రాయ్ తన ప్రేమను బయటపెట్టేసింది. అనుష్కది కర్ణాటకే. ఈ చైత్రా రాయ్‌ది కూడా కర్ణాటకే. అలా ప్రాంతీయబేధంతో ప్రేమ కలిగిందో ఏమో గానీ ఎప్పటికీ అనుష్క అంటే ఇష్టమంటోది చైత్రా రాయ్. ఈ మధ్యే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది చైత్రా రాయ్. తాజాగా చైత్రా రాయ్ మన స్వీటీ అనుష్కకు బర్త్ డే విషెస్ చెప్పింది. అనుష్క తన ఇన్ స్టాగ్రాంలో కొత్త సినిమా ప్రకటన చేసింది. ఆ పోస్ట్‌కు చైత్రా రాయ్ కామెంట్ చేసింది.
ఒకరికి ఒకరు, మనసున మనసై, దటీజ్ మహాలక్ష్మీ, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు ఇలా ఎన్నెన్నో సీరియల్స్‌తో చైత్రా రాయ్ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. స్టార్ మా, ఈటీవీ, జీతెలుగు ఇలా అన్ని చానెళ్లలో చైత్రా రాయ్ నటించింది. తాజాగా తనకు ఎంతో ఇష్టమైన హీరోయిన్ అనుష్క మీద తన అభిమానాన్ని చూపించింది. నువ్ ఎప్పటికీ కూడా నాకు ఎంతో ఇష్టమైన హీరోయిన్‌వి. నా ఫేవరేట్ హీరోయిన్‌కు హ్యాపీ బర్త్ డే. అనంతమైన ప్రేమ, సంపద, ఆరోగ్య, సంతోషం అన్నీ కూడా నీకు రావాలి అని కోరుకుంది.