• November 7, 2021

బికినీలో చూడాలని ఉందన్న నెటిజన్.. దిమ్మ తిరిగే జవాబిచ్చిన యాంకర్

బికినీలో చూడాలని ఉందన్న నెటిజన్.. దిమ్మ తిరిగే జవాబిచ్చిన యాంకర్

    యాంకర్ వింధ్యా విశాఖ గురించి క్రికెట్ అభిమానులకు ఎక్కువగా తెలుస్తుంది. అయితే బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ షోల్లో వింద్య హల్చల్ చేస్తుంటుంది. ఆ మధ్య యాంకర్ రవితో కలిసి ఓ షో చేసింది. నువ్వు రెడీ నేను రెడీ అనే షోకు ఇద్దరూ హోస్టులుగా చేశారు. కొద్ది రోజుల్లోనే షోను బాగా రన్ చేశారు. గత ఏడాది ఈ షో బాగానే క్లిక్ అయింది. వారానికి మూడు రోజులో మధ్యాహ్నం సమయంలో ఈ షో వచ్చేది. అయితే ఇప్పుడు మాత్రం ప్రసారం కావడం లేదు.

    వింధ్య తన క్రికెట్ మ్యాచ్‌లు, కామెంటరీ పనులు, ప్రజెంటర్‌గా బిజీగా మారింది. అయితే తాజాగా వింధ్య తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. ఇన్ స్టాగ్రాంలో తన ఫాలోవర్లు వేసే ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఇందులో భాగంగా చాలా మంది నేటి మ్యాచ్‌లో ఆఫ్గానిస్థాన్ గెలుస్తుందా? ఇండియా సెమీ ఫైనల్‌కు వెళ్తుందా? అని ప్రశ్నలు సంధించారు. ఆఫ్గాన్ బాగా ఆడాలని తాను కూడా కోరుకుంటున్నాను అని, భారత్ సెమీస్‌కు చేరాలని తాను కూడా కోరుకుంటున్నాను అని వింధ్య చెప్పుకొచ్చింది.

    ఓ నెటిజన్ మాత్రం వింధ్యకు షాక్ ఇచ్చాడు. బికినీలో చూడాలని ఉంది దివ అంటూ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇదిగో సాయి ముదిరాజు.. నువ్వు దివి, కివి అని ఇళా రాంగ్ అకౌంట్లకు మెసెజ్‌లు పెడితే.. భువితో నీ నెత్తి మీద ఒక్క బౌనర్ వేయిస్తాను అని వార్నింగ్ ఇచ్చింది. అలానే ఈ కశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో యాంకర్ రవి, భాను శ్రీ గురించి కూడా ప్రశ్నలను సంధించారు నెటిజన్లు. బిగ్ బాస్ షోలో రవి బాగా ఆడుతున్నాడు, అందరూ సపోర్ట్ చేయండని కోరంది. భాను శ్రీ వాయిస్, నా వాయిస్ ఒకేలా ఉంటుంది. కానీ మేం ఇద్దరం అక్కాచెల్లెళ్లం కాదు.. మా మధ్య అస్సలు పోలికలు ఉండవు అని చెప్పింది.

     

    Leave a Reply