- March 22, 2025
‘ఓదెల 2’లో భైరవి పాత్ర చేయడం నా అదృష్టం : తమన్నా భాటియా

తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది. అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం ప్రతి అప్‌డేట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ అంచనాలని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది.
ఈ వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లలో ఒకటిగా ఏప్రిల్ 17న సినిమా ఓదెల2 థియేటర్స్ లో విడుదల కానుంది. హారర్, థ్రిల్లర్ చిత్రాలకు అన్ని వర్గాల ప్రేక్షకులలో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. నాగ సాధువుగా తమన్నా భాటియా శక్తివంతమైన పాత్రలో కనిపించనున్న ఓదెల 2 కథనం, సాంకేతిక అంశాల పరంగా ఇంతకు ముందు ఎప్పుడూ చూడని గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించనుంది.
రిలీజ్ డేట్ పోస్టర్ తమన్నాను ఊహించని లుక్‌లో ప్రజెంట్ చేసింది. ఆభరణాలతో సాంప్రదాయ దుస్తులలో ధరించి, ఆమె ఒక సాధారణ మహిళగా కనిపిస్తునే ఇంటెన్స్ ఎక్స్ ప్రెషన్, గాయం గుర్తులు క్యారెక్టర్ పై చాలా క్యురియాసిటీనీ పెంచాయి. వారణాసి నేపథ్యం మిస్టీరియస్ లేయర్ ని యాడ్ చేస్తున్నాయి. హెబా పటేల్, వశిష్ట ఎన్ సింహ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. థ్రిల్లింగ్ యాక్షన్‌ను కథలలో అద్భుతంగా బ్లెండ్ చేయడంలో పేరుతెచ్చుకున్న సంపత్ నంది ఓదెల 2ని పర్యవేక్షిస్తున్నారు. ఈ చిత్రానికి కాంతర ఫేం అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చారు. సౌందరరాజన్ ఎస్ సినిమాటోగ్రఫీ నిర్వర్తించగా, రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్. అద్భుతమైన టెక్నికల్ టీంతో ఓదెల 2 ఒక మరపురాని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది.
ప్రెస్ మీట్ లో హీరోయిన్ తమన్నా భాటియా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఓదెల సినిమాని డైరెక్టర్ అశోక్ గారు చాలా అద్భుతంగా తీశారు. ఆ సినిమా చూసినప్పుడే దానికి పార్ట్ 2 ఉండాలని భావించాను. సంపత్ నంది గారు పార్ట్-2 ఐడియా చెప్పినప్పుడు ఎక్సైటింగ్ గా అనిపించింది. ఇది ఈజీ జోనర్ కాదు. ఒక పల్లెటూరి కథని ఇంత ఎక్సైటింగ్ గా థ్రిల్లింగ్ గా చెప్పడం మామూలు విషయం కాదు. డైరెక్టర్ అశోక్ సినిమాని నెక్స్ట్ లెవెల్ లో తీశారు. నేను ఏ సినిమా చేసిన ఆడియన్స్ కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉండాలని కోరుకుంటాను. అలాంటి కొత్త ఎక్స్పీరియన్స్ ని ఇచ్చే సినిమా ఇది. భైరవి క్యారెక్టర్ చేయడం యాక్టర్ గా అదృష్టంగా భావిస్తున్నాను. నా కెరీర్ లో హైయెస్ట్ ఐషాట్ క్లోజప్స్ ఉన్న సినిమా ఇదే. భైరవి క్యారెక్టర్ ని బీలవబుల్, నేచురల్, మ్యాజికల్ గా చూపించడం నిజంగా బిగ్ ఛాలెంజ్. మధు గారు సినిమా ని చాలా గ్రాండ్ గా నిర్మించారు. ఇది గ్రేట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉండే సినిమా. తప్పకుండా అందరికీ గ్రేట్ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది’అన్నారు.