- October 26, 2021
వారి చేతిలో మోసపోయిన సుప్రిత.. సురేఖా వాణి కూతురు ఎమోషనల్

సుప్రిత సోషల్ మీడియాలో సురేఖా వాణి కూతురిగానే ఎక్కువగా ఫేమస్ అయింది. ఈ తల్లీకూతుళ్లు సోషల్ మీడియాలో దుమ్ములేపుతుంటారు. అయితే సుప్రిత కంటే ఎక్కువగా సురేఖా వాణినే ఫాలో అవుతుంటారు. సురేఖా వాణి అందానికి నెటిజన్లు ఫిదా అవుతుంటారు. తల్లీకూతుళ్లలా కాకుండా అక్కా చెల్లెళ్లా ఉంటారని కామెంట్లు పెడుతుంటారు. అయితే ఈ ఇద్దరి మీద ఎక్కువగా నెగెటివ్ కామెంట్లు వస్తుంటాయి. ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతుంటుంది.
సుప్రిత చేసే చిన్న చిన్న తప్పులను కూడా నెటిజన్లు ఎత్తి చూపిస్తుంటారు. ఏదైనా పోస్ట్‌లో స్పెల్లింగ్ మిస్టేక్‌లు ఉంటే కూడా తెగ ట్రోల్ చేస్తుంటారు. చదువుకున్నావా? అసలు.. చదవకుండా ఇలా ఎప్పుడూ సోషల్ మీడియాలోనే ఉంటే ఇంకేం వస్తుందిలే అంటూ నానా రకాలుగాకామెంట్లు చేస్తుంటారు. ఇక సురేఖా వాణి మీద వచ్చే రూమర్లపైనా సుప్రిత మండిపడుతుంది. ఆ మధ్య తన తల్లి మీద వచ్చిన రెండో పెళ్లి రూమర్లను తిప్పి కొట్టేసింది. ఏదైనా పనికొచ్చే వార్తలను రాయండి అంటూ మీడియా మీద సెటైర్లు వేసింది.
అలాంటి సుప్రిత తాజాగా ఒకరి చేతిలో మోసపోయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె ఓ పోస్ట్ పెట్టింది. ఏదో ఆఫర్, ప్రొడక్ట్ కోసం సుప్రిత యాడ్ చేసినట్టుంది. దానిపై వాళ్లు సరిగ్గా రెస్పాండ్ కాకపోవడంతో సుప్రిత మండిపడింది. హాయ్ గాయ్స్.. ప్రాఫిట్ సెంటర్ వాళ్లు నా కాల్స్‌ను లిఫ్ట్ చేయడం లేదు. చాలా రకాల సోర్స్ నుంచి వారిని కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నా. కానీ కుదరడం లేదు. నేను వారి చేతిలో మోసపోయాను.
ఒకవేళ వాళ్లు గనుక రెస్పాండ్ అవ్వలేదంటే.. లీగల్ యాక్షన్ తీసుకుంటాను. ఇప్పటికే అన్ని ఆధారాలు సేకరించి పెట్టాను. వాళ్లు మోసం చేస్తున్నారు అని తెలిసిన క్షణం నుంచే జాగ్రత్త పడ్డాను. అందుకే స్టోరీని డిలీట్ చేశాను. మీకు ఏం జరుగుతోందో అప్డేట్ చేస్తుంటాను. దీన్ని మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టను. దయచేసి అర్థం చేసుకోండి అని సుప్రిత వేడుకుంది.