- January 13, 2022
Super Star Krishna: నేను నటించిన స్టైల్లోనే నటించాడు.. అశోక్‌పై సూపర్ స్టార్ కృష్ణ
Super Star Krishna సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు ,గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో గల్లా పద్మావతి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా గురువారం నాడు చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో
సూపర్ స్టార్ కృష్ణ వీడియో సందేశం ద్వారా మాట్లాడారు. ‘నేను సినిమాను చూశాను. ఎక్కడా బోర్ కొట్టలేదు. సబ్జెక్ట్‌లో కొత్తదనం ఉంది. సినిమాను బాగా తీశారు. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను. అశోక్ కొత్తవాడిగా ఎక్కడా అనిపించలేదు. ముప్పై నలభై సినిమాల అనుభవం ఉందన్నట్టుగా నటించాడు. డ్యాన్స్, యాక్షన్ ఇలా అన్నీ చేశాడు. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. ఏడు ఎనిమిదేళ్ల వయసులోనే నా పండంటి సంసారం సినిమాలో నటించాడు.
ఏం చెబితే అది చేసేవాడు. లంచ్ టైంలో నేను రెస్ట్ తీసుకుంటుంటే.. అతను మాత్రం సెట్‌లో అందరి దగ్గరకు వెళ్లి నేర్చుకునేవాడు. డ్యాన్స్ మూమెంట్స్, కర్ర తీసుకుని ఫైట్ చేయడం వంటివి చేసేవాడు. శ్రీరామ్ అద్బుతంగా తెరకెక్కించాడు. పద్మా నాతో చిన్నప్పటి నుంచి సినిమా షూటింగ్‌లకు వచ్చేది. ఆమె మంచి నిర్మాతగా నిలబడుతుందని నా నమ్మకం. ఫస్ట్ సీన్‌లో కౌబాయ్‌లా కనిపిస్తాడు. మోసగాళ్లకు మోసగాడు సినిమాయే జ్ఞాపకం వచ్చింది.
నేను నడిచినట్టుగానే నడిచాడు. నేను నటించిన స్టైల్లో నటించాడు. జుంబారే పాటకు అద్బుతంగా డ్యాన్స్ చేశాడు. యమలీల కచ్చితంగా గుర్తుకు వస్తుంది. నా అభిమానులు, మహేష్ అభిమానులు ఈ సినిమాను చూసి అశోక్‌ను హీరోగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను. పండుగ సీజన్‌లో ఈ సినిమాను చూసి మీరంతా ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను’ అని అన్నారు.
- Tags
- Archana ananth
- Ashok Galla
- Hero Movie
- Hero Movie Pre Release Event
- K Raghavendra Rao
- Karthika Deepam
- Karthika Deepam Soundarya
- Radha Krishna Kumar
- Rana Daggubati
- Siva Nirvana
- Sriram Aditya
- Super Star Krishna
- V K Naresh
- అర్చన
- అశోక్ గల్లా
- కార్తీక దీపం
- కే రాఘవేంద్ర రావు
- రాధాకృష్ణ కుమార్
- రానా
- వీకే నరేష్
- శివ నిర్వాణ
- శ్రీరామ్ ఆదిత్య
- సూపర్ స్టార్ కృష్ణ
- సౌందర్య
- హీరో