- January 13, 2022
Koratala Siva: నా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు.. అశోక్ గల్లాపై కొరటాల శివ
Koratala Siva సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు ,గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో గల్లా పద్మావతి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా గురువారం నాడు చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో
కొరటాల శివ మాట్లాడుతూ.. ‘ట్రైలర్, సాంగ్స్ బాగున్నాయి. శ్రీరామ్ ఆదిత్య అద్బుతంగా తెరకెక్కించాడు. శ్రీమంతుడు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. మహేష్ బాబు చెప్పాడు. జయదేవ్ గారి అబ్బాయి ఇక్కడ పని చేయగలడా? అని అనుకున్నాను. కానీ ఎప్పుడూ పని చేస్తూనే ఉండేవాడు. ఏడీగా పని చేస్తూనే నోట్ బుక్ కూడా రాసుకునేవాడు. ఏం రాసుకుంటున్నావ్ అని అడిగాడు. మహేష్ బాబు ఎలా నటిస్తున్నాడు అని నోట్ చేసుకున్నాడు.
ఈ జాబ్ ఆ జాబ్ కలిసి చేస్తున్నాడు.. ఏం అవ్వాలని అనుకుంటున్నాడు అని మహేష్ బాబుని అడిగాను. నటిస్తాడు అని అన్నాడు. అప్పుడు చూసిన అశోక్‌కి ఇప్పుడు చూస్తున్న అశోక్‌లో ఎంతో మార్పుంది. స్ప్లిట్ పర్సనాలిటీలా అనిపించింది. అంతా దాచుకుని ఇలా ఒక్కసారిగా తెరపై చూపించడం మామూలు విషయం కాదు. కృష్ణగారి, మహేష్ బాబు గారి లెగసీని ముందుకు తీసుకెళ్తాడు. నిధి అగర్వాల్ ఈ సినిమాకు బలంగా మారుతుంది. ఆ ఇద్దరి కెమిస్ట్రీ బాగుంది. భరత్ అనే నేను సినిమా అయిపోయాక తిరుపతిలో జయ్ గారి ఇంటికి వెళ్లాం.
పెద్ద ఫ్యామిలీ అని విన్నాం. స్నాక్స్ తిని అలా.. సాయంత్రం స్వామి వారి దర్శనానికి వెళ్దామని అనుకున్నాం. అందరూ బయట ఉండి గుమ్మడి కాయతో దిష్టి తీశారు. ఎంత ట్రెడిషినలర్, హాస్పిటాలిటీ, మర్యాద, ఎంతో ఒదిగి ఉండే ఫ్యామిలీ. ఉన్న కొద్ది సమయంలో.. వారి ఫ్యాక్టరీ అంతా చూపించారు. ఇంత మంచి మనుషులా? అని అనుకున్నాను. అమరరాజా ఎందుకంత సక్సెస్ అయిందో నాకు ఆ రోజు నాకు అనిపించింది. వాళ్లు సినిమాల్లోకి రావడం, ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేయడం ఆనందంగా ఉంది. అలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం. చాలా పెద్ద సినిమాలు తీయాలి. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
- Tags
- Archana ananth
- Ashok Galla
- Hero Movie
- Hero Movie Pre Release Event
- K Raghavendra Rao
- Karthika Deepam
- Karthika Deepam Soundarya
- Koratala Siva
- Radha Krishna Kumar
- Rana Daggubati
- Siva Nirvana
- Sriram Aditya
- Super Star Krishna
- V K Naresh
- అర్చన
- అశోక్ గల్లా
- కార్తీక దీపం
- కే రాఘవేంద్ర రావు
- కొరటాల శివ
- రాధాకృష్ణ కుమార్
- రానా
- వీకే నరేష్
- శివ నిర్వాణ
- శ్రీరామ్ ఆదిత్య
- సూపర్ స్టార్ కృష్ణ
- సౌందర్య
- హీరో