• August 2, 2025

ఆగస్టు 8న సెన్సేషనల్ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ “మాతృ”

ఆగస్టు 8న సెన్సేషనల్ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ “మాతృ”

    హీరో శ్రీరామ్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘మాతృ’ ఇందులో సుగి విజయ్, రూపాలీ భూషణ్ జంటగా నటించారు అలీ, ఆమనీ, రవి కాలే, పృథ్వీ రాజ్, దేవి ప్రసాద్, నందినీ రాయ్ ముఖ్య భూమికలు పోషించారు ఈ చిత్రాన్ని శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ పై బూర్లె శివ ప్రసాద్ ప్రతిష్ఠాతకంగా నిర్మించారు. సైంటిఫిక్ త్రిల్లర్ కథనం తో దర్శకుడు జాన్ జాక్కి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మాతృ చిత్రం ఆగస్ట్ 8 న మీ అభిమాన థియేటర్ లో ప్రదర్షింపబడుతుంది ఈ చిత్రం లోని సంగీతంకు ఆదిత్య మ్యూజిక్ లో మంచి వచ్చింది.

    నిర్మాత బి. శివప్రసాద్ మాట్లాడుతూ – మా బ్యానర్ లో నిర్మించిన మాత్రు సినిమాను ఈ నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాం. ఒక డిఫరెంట్ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీగా మాత్రు మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన మా సినిమా కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాకు కూడా థియేటర్స్ లో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.