• January 14, 2022

Naga Chaitanya: స్టేజ్ మీదే నాగ చైతన్య సరసాలు.. కవర్ చేసిన డైరెక్టర్

Naga Chaitanya: స్టేజ్ మీదే నాగ చైతన్య సరసాలు.. కవర్ చేసిన డైరెక్టర్

    Naga Chaitanya ఈ మధ్య ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. బంగార్రాజు సినిమా ఈవెంట్‌లో హీరోయిన్ దక్షా నగార్కర్ కొంటె చూపులు, నాగ చైతన్య సిగ్గు పడటం దానికి సంబంధించిన వీడియో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. కొంటెగా హీరోయిన్ కళ్లు ఎగిరేస్తే మనోడు చిలిపిగా సిగ్గుపడ్డాడు. అయితే ఈ వీడియో మీద విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.

    నాగ చైతన్య కూడా మన్మథుడే.. చైలో కూడా కళలున్నాయ్ అని సెటైర్లు వేశారు. అయితే తాజాగా నాగ చైతన్య గురించి చెబుతూ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కవర్ చేసే ప్రయత్నం చేశాడు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కళ్యాణ్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. అంతా ఆ హీరోయిన్ వల్లే జరిగిందంటూ ఆమె మీదే తోసేశాడు.

    చై బంగారం. చైతూని అందరూ బంగారం ఎందుకు అని అంటారో ఆయనతో పని చేశాక తెలుస్తుంది. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాను చేశాను. ఇప్పుడు బంగార్రాజు చేశాను. 24 కారెట్స్ కాస్త 48 కారెట్స్ అయింది. ఈ నాలుగేళ్లలో అతనిలో చాలా మార్పులు వచ్చాయి. మాట్లాడే పద్దతి, నటన, మెచ్యూరిటీలో మార్పులు వచ్చాయి. చైలో ఉన్న క్లారిటీ మనకు పది శాతం ఉంటే.. హ్యాపీగా బతికేయోచ్చు. షాట్ విషయంలోనూ ఎంత కన్విన్స్ చేసినా కూడా ఒప్పుకోడు.

    చాలా కన్విన్స్ చేస్తే నాకు నచ్చలేదు కానీ నువ్ చెప్పావ్ కాబట్టి చేస్తాను అని అంటారు. అంత క్లియర్‌గా క్లారిటీగా ఉంటాడు కాబట్టి కారెక్టర్ చేయడం ఈజీగా అయింది. ఈ సినిమా వల్ల ప్రతీ రోజు సెట్‌లో కలిశాం. చై సైలెంట్ అని అనిపిస్తుంది. కానీ అంత సైలెంట్ కాదు. ఓపెన్ అప్ ఎంజాయ్ చేస్తే నవ్వు ఎంతో ప్లెజెంట్‌గా ఉంటుంది. ఇంత వరకు రాముడి పాత్రలు చేస్తే ఇప్పుడు చేసింది కృష్ణుడు కారెక్టర్. మొన్నే దక్ష కళ్లు ఎగరేసింది. నాగ చైతన్య సిగ్గు పడ్డాడు. ఆయన సిగ్గు పడటం కామన్. అదంతా కూడా ఆమె వల్లే జరిగింది. చై అలానే ఎప్పుడూనవ్వుతూనే ఉంటాడు అని క్లారిటీ ఇచ్చాడు

    Leave a Reply