- February 3, 2024
బూట్ కట్ బాలరాజు రివ్యూ.. ఆటాడుకున్న సోహెల్

Bootcut Balaraju Movie Review సోహెల్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడో అందరికీ తెలిసిందే. సినిమాల్లో జూ. ఆర్టిస్ట్‌గా సైడ్ పాత్రలు చేసి.. సీరియల్స్ నుంచి బిగ్ బాస్ స్థాయి వరకు వచ్చాడు. బిగ్ బాస్ షోతో అందరినీ ఆకట్టుకున్న సోహెల్.. ఇప్పుడు వెండితెరపై వరుస సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు. చివరగా మిస్టర్ ప్రెగ్నెంట్ అని హిట్టు కొట్టాడు. అలాంటి సోహెల్ ఇప్పుడు బూట్ కట్ బాలరాజు అంటూ ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓసారి చూద్దాం.
సోహెల్ (బూట్ కట్ బాలరాజు) ఊర్లో అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. పటేలమ్మ (ఇంద్రజ) ఆ ఊరికి పెద్ద. ఊరికి అమ్మలా అన్ని విధాలా మంచి చేస్తూ ఉంటుంది. దీంతో ఆ పటేలమ్మా అంటే అందరికీ ఎంతో గౌరవం. మరోవైపు పటేలమ్మ కూతురు మహాలక్ష్మి (మేఘ లేఖ) బూట్ కట్ బాలరాజు బాల్యస్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బూట్ కట్ బాలరాజును సిరి (సిరి హన్మంతు) ప్రేమిస్తుంది. దాంతో బాలరాజు తనకు దక్కడేమో అనే భయంతో మహాలక్ష్మి తన ప్రేమ గురించి బాలరాజు చెప్పడంతో ప్రేమ కథ మొదలు అవుతుంది. మరి బాలరాజు – మహాలక్ష్మి ప్రేమ కథకి ఉన్న సమస్య ఏమిటి ?, అసలు ఎందుకు బాలరాజు సర్పంచ్ గా పోటీ చేస్తాడు ?, ఇంతకీ పటేలమ్మా పై సర్పంచ్ గా బాలరాజు గెలిచాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.
ఈ సినిమాలో హీరోగా నటించిన సోహెల్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కామెడీ సీన్స్ లో, కొన్ని ఎమోషనల్ సీన్స్ లోసోహెల్ తన హావభావాలతో ఆకట్టుకున్నాడు. తన భుజాన మోశాడు ఇక హీరోయిన్ గా నటించిన మేఘలేఖ తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. ప్రేమ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా సహజంగా నటించింది. అలాగే మరో హీరోయిన్ సిరి హనుమంత్ కూడా చాలా బాగా నటించింది.
ప్రేమించిన అమ్మాయి కోసం సయ్యద్ సోహైల్ పడిన తపన, అలాగే సర్పంచ్ గా గెలిచే క్రమంలో వచ్చే సీన్స్ బాగున్నాయి. ఇక ఇతర కీలక పాత్రల్లో నటించిన సునీల్, ఇంద్రజ, జబర్దస్త్ రోహిణి వంటి నటీనటులు కూడా తమ ఎక్స్ ప్రెషన్స్ తో, తమ శైలి మాడ్యులేషన్స్ తో నవ్వించే ప్రయత్నం చేశారు. అదే విధంగా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ముక్కు అవినాష్, సద్దాం కీలక పాత్రల్లో అలరించారు.
కోనేటి శ్రీను తీసుకున్న కథాంశం, సోహెల్ – ఇంద్రజ పాత్రలను డిజైన్ చేసుకున్న తీరు బాగుంది. అయితే కథనం మాత్రం ఊహకందేలా సాగుతుంది. చాలా చోట్ల సింపుల్‌గా అనిపించినా..ఎంగేజింగ్‌గా, ఎంటర్టైనింగ్‌గా సాగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ మరింత వినోదాత్మకంగా సాగుతూనే ఎమోషనల్‌గానూ ఉంటుంది. కొన్ని చోట్ల లాజిక్ లేనట్టుగా అనిపించినా.. అందరినీ నవ్విస్తుంది. అందరినీ కదిలిస్తుంది. హీరోహీరోయిన్ల మధ్య ఉన్న లవ్ సీన్సరొటీన్ అనిపించినా.. ఆ జోడితెరపై కొత్తగా, ఆకట్టుకునేలా అనిపిస్తుంది. సినిమా అంతా కూడా ఊర్లోనే తీసినట్టుగా అనిపిస్తుంది.
అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఆడియెన్స్‌ను కట్టి పడేస్తాయి. మొత్తానికి దర్శకుడు స్క్రిప్ట్‌లో ఉన్న కంటెంట్, ఆ ఎమోషన్‌ను జనాలకు రీచ్ అయ్యేలా చేసేందుకు బాగానే కష్టపడ్డాడు. సినిమాలో కొన్ని రొటీన్ సన్నివేశాలను ఇంకాస్త బాగా రాసుకుని సినిమా స్థాయి వేరేలా ఉండేది. అలాగే, ప్రీ క్లైమాక్స్ ను, క్లైమాక్స్ సినిమా మరింత ఎమోషనల్‌గా అనిపిస్తుంది.
హీరో పాత్రను చాలా సరదాగా, అందరినీ నచ్చేలా, అందరినీ ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. ఓవరాల్ గా ఈ సినిమాలో కథాకథనాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కొన్ని చోట్ల ఫ్లో మిస్ అయినట్టు అనిపించినా.. కామెడీ, ఎంటర్టైన్మెంట్‌తో నడిపించేశాడు దర్శకుడు. ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. కోనేటి శ్రీను రచయితగా సఫలం అయ్యాడని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే పరంగా మ్యాజిక్ చేయకపోయినా.. ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాడు. పాటలు తెరపై ఆకట్టుకుంటాయి. ఆర్ఆర్ సినిమా స్థాయిని పెంచింది. ఎడిటర్ తన పని తాను సమర్థవంతంగా చేశాడు. సినిమాటోగ్రఫీ, కెమెరా వర్క్ రిచ్‌గా బాగుంది. ఇక నిర్మాత ఎండీ పాషా పెట్టిన డబ్బులు, ఆ ఖర్చు, ఆ రిచ్ నెస్ తెరపై కనిపిస్తున్నాయి.
రేటింగ్ 3