- January 8, 2022
Singer Chinmayi : నెలకొకసారి ఆ పని చేయొచ్చా?.. నెటిజన్ ప్రశ్నకు చిన్మయి ఘాటు రిప్లై

Chinmayi Sripada సింగర్ చిన్మయి నెట్టింట్లో చేసే కామెంట్లు, ఆమెపై ఎదురయ్యే ట్రోలింగ్ గురించి అందరికీ తెలిసిందే. చిన్మయి ఫెమినిస్ట్ అనే ముద్ర పడిన సంగతి తెలిసిందే. చిన్మయి దృష్టిలో మగవాళ్లంటే చిన్నచూపే అనే భావనను కలిగించారు. కానీ తప్పు ఎవరు చేసినా చిన్మయి తప్పనే చెబుతుంది. అది అమ్మాయిలు చేసినా, అబ్బాయిలు చేసినా తప్పుని తప్పుగానే చిన్మయి చెబుతుంటుంది.
కానీ కొందరు చిన్మయి మాటల్లోని ఆంతర్యం గ్రహించక ఆమెను ట్రోల్ చేస్తుంటారు. ఇక ఎక్కువ మంది అమ్మాయిలు, మహిళలు చిన్మయిని సలహాలు అడుగుతుంటారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు సంప్రదిస్తుంటారు. అయితే తాజాగా చిన్మయి తన ఫాలోవర్లతో చిట్ చేసింది. ఎలాంటి ప్రశ్నలైనా సంధించండి అని చిన్మయి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్స్ పెట్టేసింది.
దీంతో కొందరు ఆకతాయిలు కావాలనే అసభ్యకరమైన ప్రశ్నలు వేశారు. శృంగార వీడియోలు చూడొచ్చా? వాటిని చూసి హస్త ప్రయోగం చేసుకోవచ్చా? నెలకు ఒకసారి హస్త ప్రయోగం చేసుకుంటే మంచిదేనా? వంటి చెత్త ప్రశ్నలను సంధించారు. దానికి చిన్మయి గట్టిగానే కౌంటర్ వేసింది.
ఇలాంటి ప్రశ్నలు నన్ను ఎందుకు అడుగుతున్నారు.. మీరు ఎప్పుడు హస్తప్రయోగం చేసుకోవాలనే నన్ను ఎందుకు అడగటం.. నేనేమీ సెక్స్ థెరపిస్ట్‌ను కాదు.. మీకు అంతగా కావాలంటే ఎండోక్రైనాలజిస్ట్, గైనకాలజిస్ట్‌ను అడగండి అని సలహా ఇచ్చింది. ఇంకొంచెం ఉంటే.. ఎప్పుడు పోవాలి.. ఎప్పుడు పోయాలి అని నన్ను అడిగేట్టున్నారు అంటూ కౌంటర్ వేసింది.