- October 26, 2021
Bigg Boss 5 Telugu : రోజూ అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నా.. సిరి లవర్ శ్రీహాన్ లెటర్ వైరల్

బిగ్ బాస్ ఇంట్లో సోమవారం నాటి నామినేషన్ ప్రక్రియ ఎంతో ఎమోషనల్‌గా సాగింది. ఇందులో కంటెస్టెంట్లకు ఇంటి సభ్యుల నుంచి లెటర్స్ వచ్చాయి. అయితే కొందరికి మాత్రమే ఆ లెటర్లు పొందే అవకాశం ఉంటుందని, లెటర్లు పొందలేని వాళ్లు నామినేట్ అవుతారని బిగ్ బాస్ తెలిపాడు. ఈ క్రమంలో విశ్వ, సిరి మధ్యలో పోటీ వచ్చింది. విశ్వ తన బాబు కోసం పరితపించడం చూసి సిరి తన లెటర్‌ను వదులుకుంది. నామినేట్ అయింది. ఆ లెటర్‌లో శ్రీహాన్ ఏమీ రాసి ఉంటాడో.. ఇలా చదవలేదని తెలిస్తే ఫీల్ అవుతాడు అని సిరి ఏడ్చేసింది.
అయితే సిరి లవర్ శ్రీహాన్ రాసిన లెటర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘మన ఏడేళ్ల పరిచయంలో ఇన్ని రోజులు నీకు దూరంగా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. 47రోజులైంది నువ్ వెళ్లి. నువ్ నా పక్కన లేకపోయినా కూడా నేను న లవ్‌ను ఫీల్ అవుతున్నాను. దానికి కారణం మన మధ్య ఉన్న ప్రేమ ప్రభావం. మా అమ్మానాన్న తరువాత నా గురించి ఎవరైనా ఆలోచించే వారున్నారంటే అది నువ్వే సిరి. గవర్నమెంట్ జాబ్ వదిలేసి యాక్టింగ్ కోసం నేను వచ్చినప్పుడు.. మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నా వరకు తీసుకురాకుండా నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసు. మనం బాగున్నప్పుడు అందరూ మనల్ని నమ్ముతారు ప్రేమిస్తారు. కానీ నా దగ్గర ఏమీ లేనప్పుడు కూడా నువ్ నన్ను నమ్మావ్ ప్రేమించావ్. ఒక మాట చెప్పనా? నా నిజమైన సక్సెస్ నువ్వే సిరి. నీ నవ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి.
నువ్ బాధపడటం, ఏడుస్తుండటం నేను చూడలేను. నువ్ ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండాలి. బాగా ఆడుతున్నావ్.. ఇంకా బాగా ఆడాలి. నీకు నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే ఏదైనా ఒక పని చేస్తే ముందు ఆలోచించి చెయ్.. నీతో పాటు మిగతా కంటెస్టెంట్లకు కూడా ఆల్ ది బెస్ట్. ఈ 47 రోజుల్లో ఇంటి దగ్గర కంటే అన్నపూర్ణ గేట్ దగ్గరే ఎక్కువగా ఉన్నాను. నువ్ వచ్చాక పెళ్లి చేసుకుని లైఫ్ లాంట్ కలిసుందాం. నువ్ నా పక్కనుంటే ఎంత ధైర్యమో.. మొన్న నాకు ఫీవర్ వచ్చినప్పుడు నువ్ నా పక్కన లేనప్పుడు తెలిసింది. కానీ పక్కన వీధిలో ఉన్న డాక్టర్ ధైర్యంలో పాటు పెద్ద ఇంజక్షన్ కూడా ఇచ్చాడు. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. ఇది నేను నీకు రాసే ఫస్ట్ లెటర్ కదా?.. ఎప్పుడూ పక్కనే ఉండి చెప్పేవాడిని.. ఇప్పుడు నీకు దూరంగా ఉండి చెబుతున్నాను.. ఐ లవ్యూ సిరి.. నీ శ్రీహాన్.. హీరో గాడు కూడా నిన్ను మిస్ అవుతున్నాడు.. నీకోసం గేట్ దగ్గర రోజు చూస్తున్నాడు’ అని ఎమోషనల్ నోట్ రాశాడు.