• October 28, 2021

బిగ్ బాస్ వంటగదిలో సరసాలు.. హగ్గులతో సిరి, షన్ను రచ్చ

బిగ్ బాస్ వంటగదిలో సరసాలు.. హగ్గులతో సిరి, షన్ను రచ్చ

    బిగ్ బాస్ ఇంట్లో షన్ను, సిరిల మధ్య ఉండే ఆ ట్రాక్ కాస్త వింతగానే ఉంటుంది.అది ఫ్రెండ్ షిప్ కంటే ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తోంది. షన్నుకు దూరంగా సిరి ఉండలేదు. షన్ను మాట్లాడకపోతో ఒంటరిగా ఫీలవుతుంది. ఏడుస్తుంది. బాధపడుతుంది. షన్ను మాట్లాడే వరకు మళ్లీ నార్మల్ మనిషిలా అవ్వదు. అయితే ఇప్పుడు షన్ను ఆమెను మరీ అంత దూరంగా పెట్టడం లేదు. కలిసే ఉంటున్నారు. జెస్సీ ఈ మధ్య కాస్త దూరంగా ఉంటున్నాడు.

    సిరి, షన్నులే ఎక్కువగా కలిసి ఉంటున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో అయితే సిరి, షన్నులు బిగ్ బాస్ ఇంట్లో రచ్చ చేసేశారు. అభయ హస్తం టాస్కులో భాగంగా సిరి, షన్నులకు మాత్రం బిగ్ బాస్ ఇంట్లోకి అనుమతి లభించింది. దీంతో ఆ ఇద్దరు మాత్రమే టాస్కులు గెలిచి ఇంట్లోకి వెళ్లేందుకు అర్హత సాధించారు. అలా సిరి, షన్నులు దొరికించే చాన్స్ అనుకుని రెచ్చిపోయారు. మొత్తానికి బిగ్ బాస్ వంటగదిలో దుమ్ములేపేశారు.

    ఇష్టమొచ్చినట్టుగా వండుకుని తినేశారు. ఇక ఒకరినొకరు కొట్టుకోవడం, కాళ్లతో తన్నుకోవడం, హగ్గులు చేసుకోవడం, సారీలు చెప్పడం,అలగడం, మళ్లీ హగ్గులు ఇచ్చుకోవడంతో నానా హంగామా చేశారు. మొత్తానికి వీరి సరసాలకు వంటగది సాక్ష్యంగా మారిపోయింది. వీరిద్దరు ఎంత స్నేహంగా ఉన్నా కూడా ఆ ట్రాక్ మాత్రం అంతగా వర్కవుట్ అవ్వదు. ఎందుకంటే బయట వారిద్దరికి జోడి రెడీగా ఉంది. షన్ను దీప్తితో, సిరి శ్రీహాన్‌తో ఆల్రెడీ కమిట్ అయి ఉన్నారు.

    Leave a Reply