• November 16, 2021

Cauliflower : హిట్ మీది తేడా కొడితే నాది.. దటీజ్ సంపూర్ణేష్ బాబు!

Cauliflower : హిట్ మీది తేడా కొడితే నాది.. దటీజ్ సంపూర్ణేష్ బాబు!

    బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పిల్లలో సంపూర్ణేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. హృదయ కాలేయం సినిమాతో సంపూర్ణేష్ బాబు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. హీరో అంటే ఇలానే ఉండాలి అనే రూల్స్‌ను బ్రేక్ చేశాడు సంపూర్ణేష్ బాబు. జనాలు మెచ్చితే ఎవ్వరైనా సరే హీరోలే అని నిరూపించాడు. తన దైన శైలిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. తాజాగా సంపూర్ణేష్ బాబు క్యాలీ ఫ్లవర్ అంటూ ముందుకు రాబోతోన్నాడు.

    నవంబర్ 26న రాబోతోన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా సంపూర్ణేష్ బాబు మాట్లాడాడు. మగాడు తన శీలాన్ని కాపాడుకుంటే దేశంలో ఎలాంటి నేరాలు జరగవు. ఒక మగాడి శీలం పోతే దాని కోసం పోరాటమే క్యాలీ ఫ్లవర్ అని కథ చెప్పినప్పుడు వెంటనే ఓకే చెప్పాను. అది నాకు ఎంతో నచ్చింది. హృదయకాలేయం, కొబ్బరిమట్ట, సింగం 123 లాంటి సినిమాలే ఎక్కువగా నచ్చాయి. ఇప్పుడు రాబోతోన్న క్యాలీ ఫ్లవర్ కూడా అలా అందరికీ నచ్చుతుంది.

    సినిమా హిట్ అయితే అది మీవల్లే (ఆడియన్స్) తేడా కొడితే అది నా వల్లే అని నేను మనస్ఫూర్తిగా తీసుకుంటాను అని నిర్మొహమాటంగా చెప్పాడు. కానీ ఇలా చాలా అరుదుగా ఉంటారు. ఫ్లాపులను ఇతరులా ఖాతాలో వేస్తుంటారు. కానీ సంపూర్ణేష్ బాబు మాత్రం ఫ్లాపులకు బాధ్యత తనదే అని తీసుకుంటున్నాడు. దటీజ్ సంపూర్ణేష్ బాబు అని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ క్యాలీ ఫ్లవర్ ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

    Leave a Reply