- November 26, 2021
పీఏకు ఉన్న వ్యాల్యూ కూడా చైతూకి లేదా!.. సమంత ఉద్దేశ్యం ఏంటి?
సమంత వ్యవహారం ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. మాజీ భర్త, కో స్టార్ అయిన నాగ చైతన్య బర్త్ డేకు ఒక్క పోస్ట్ కూడా వేయలేదు. విషెస్ చెప్పలేదు. కానీ తెల్లారే తన పెట్, పెంపుడు కుక్క హష్ బర్త్ అని నానా హంగామా చేసింది. బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది. మూడేళ్లు నిండాయని హష్‌కు స్పెషల్ విషెస్ చెప్పారు. ఇక సమంత ఫ్రెండ్స్ అయిన సాధన, ప్రీతమ్, నీలిమ గుణ, డాక్టర్ మంజుల వంటి వారు హష్‌కు విషెస్ చెప్పారు.
సరే హష్‌ను తన సొంత బిడ్డలా చూసుకుంటుంది కదా? అని జనాలు అనుకున్నారు. అయినా కూడా మాజీ భర్తకు కనీసం విషెస్ చెప్పడానికి కూడా టైం దొరకలేదా? అని నెటిజన్లు మండి పడుతున్నారు. ఇక అంతే కాకుండా నిన్న తన పీఏ పర్సనల్ అసిస్టెంట్ ఆర్యన్ రాజేష్ దగ్గుబాటి బర్త్ డే. అతనికి కూడా సమంత స్పెషల్‌గా విషెస్ చెప్పింది. దీంతో అభిమానులు మరింతగా హర్ట్ అయ్యారు.
హష్ బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది.. ఇక పీఏ బర్త్ డేకు స్పెషల్‌గా విషెస్ అందించింది. నువ్ లేకపోతే నేను ఏమీ చేయలేను అంటూ ఆర్యన్ రాజేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది సమంత. అయితే నాగ చైతన్య మాత్రమే సమంతకు కనబడలేదన్నమాట. చైతూ బర్త్ డే అని సమంతకు గుర్తు లేదా? గుర్తుండి కూడా విషెస్ చెప్పాల్సిన అవసరం లేదని భావించిందో? ఏమో గానీ మొత్తానికి ఈ విషయాలతో సమంత ఉద్దేశ్యం ఏంటో క్లియర్‌గా అర్థమైంది. ఇక అక్కినేని ఫ్యామిలీతో ఎటువంటి సంబంధాలను మెయింటైన్ చేయకూడదని సమంత గట్టిగా నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.