- November 8, 2021
నువ్ నా జీవితంలోకి రావడం అదృష్టం.. సమంత ఎమోషనల్

సమంత ఎప్పుడూ ఒంటరిగా లేదు. తనకు ఇష్టమైన వారితోనే కలిసి ఉంది. నాగ చైతన్యతో విడాకుల కంటే ముందు కూడా సమంత తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉంది. వారితోనే ఎక్కువ సమయాన్ని గడిపేది. నాగ చైతన్యతో విడాకుల తరువాత మరీ ఎక్కువగా ఉంటోంది. శిల్పా రెడ్డితో ఛార్ ధామ్ యాత్రకు వెళ్లింది. ఆ తరువాత ప్రీతమ్ జుకల్కర్, సాధన సింగ్‌లతో కలిసి దుబాయ్ చెక్కేసింది. అక్కడ ఓ వారం రోజులు ఫుల్లుగా ఎంజాయ్ చేసి వచ్చింది.
ఆ తరువాత ఇక్కడ దీపావళి వేడుకల్లో సందడి చేసింది. ఉపాసన, శిల్పా రెడ్డి ఏర్పాటు చేసిన దీపావళి సెలెబ్రేషన్స్‌లో సమంత కనిపించింది. మొత్తానికి విడాకులు అయ్యాయని ఏ మాత్రం బాధ లేకుండా సమంత ఫుల్లుగా సందడి చేస్తోంది. ఇక సమంత కోటరిలో కొందరు కనిపిస్తుంటారు. డైరెక్టర్ నందినీ రెడ్డి, శిల్పా రెడ్డి, డాక్టర్ మంజుల అనగాణి, చిన్మయి శ్రీపాద, సాధన సింగ్ వంటి వారుంటారు. నేడు డాక్టర్ మంజుల అనగాని పుట్టిన రోజు నేడు.
ఈ సందర్బంగా మంజులకు సమంత స్పెషల్ ట్రీట్ ఇచ్చినట్టుంది. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను సమంత షేర్ చేసింది. సమంత అందులో చేసిన అందాల ఆరబోత మామూలుగా లేదు. అయితే అది కాసేపు పక్కన పెట్టేద్దాం. మంజుల గురించి సమంత చెబుతూ ఎమోషనల్ అయింది. నీ లాంటి ఓ ఫ్రెండ్ నా లైఫ్‌లోకి రావడం నా అదృష్ణమని నేను భావిస్తాను. కష్టకాలంలోనే నిజమైన ఫ్రెండ్ ఎవరో తెలుస్తుందని అంటారు. నీ కంటే నిజమైన స్నేహితులు ఎవ్వరూ లేరు డాక్టర్.. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలిసి ఉంటుందని ఆశిస్తున్నాను.. హ్యాపీ బర్త్ డే అంటూ సమంత ఎమోషనల్ అయింది.