• December 14, 2021

ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి?.. ఏ డ్రెస్సులు వేసుకోవాలో మీరే చేబుతారా? : సమంత

ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి?.. ఏ డ్రెస్సులు వేసుకోవాలో మీరే చేబుతారా? : సమంత

    Samantha Ruth Prabhu సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. పర్సనల్, ప్రొఫెషన్ విషయాలతో సమంత నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది. నిన్న అంతా కూడా సమంత ఆరోగ్యానికి సంబంధించిన పుకార్లు ఎక్కువయ్యాయి. దగ్గు, జలుబుతో కాస్త బాధపడిన సమంత హాస్పిటల్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకుందట. దీంతో నెట్టింట్లో మాత్రం తీవ్ర అస్వస్థత, కరోనా అంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి.

    అయితే వెంటనే సమంత మేనేజర్ మాత్రం ఈ రూమర్లకు అడ్డుకట్ట వేసేశాడు. సోషల్ మీడియాలో వస్తోన్న రూమర్లను నమ్మొద్దని తెలిపాడు. సమంత క్షేమంగా ఉందని ప్రకటించాడు. అలా మొత్తానికి సమంత వార్తలు ఒక్కసారిగా నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇక తాజాగా మరోసారి సమంత నెట్టింట్లో వైరల్ అవుతోంది. విడాకుల వ్యవహారం నుంచి సమంత ఏదో ఒక కొటేషన్, సూక్తులు చెబుతూనే ఉంది.

    ఎవరో ఎక్కడో రాసినా, మాట్లాడిన వాటిని సమంత ఉటంకిస్తూనే ఉంది. తాజాగా ప్రియాంక చోప్రా ఎక్కడో ఏదో ఈవెంట్లో మాట్లాడిన మాటలను ఇప్పుడు సమంత షేర్ చేసింది. అందులో ఆడవాళ్లందరి తరుపున ప్రియాంక మాట్లాడింది. ఆ మాటలనే తాను కూడా చెప్పాలని అనుకుంటున్నట్టుగా సమంత ఫీలైనట్టుంది. అందుకే ప్రియాంక చోప్రా వీడియోను సమంత షేర్ చేసింది.

    మేం ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి.. ఎప్పుడు పిల్లల్ని కనాలి.. ఎప్పుడు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి.. అనేది మీరే చెబుతారు. ఎందుకు.. మాకు మేం మా నిర్ణయాన్ని తీసుకునే స్వేచ్చను ఇవ్వండి అంటూ ప్రియాంక ఓ అంతర్జాతీయ వేదిక మీద చెప్పింది. అదే వీడియోను సమంత షేర్ చేసింది. తన ఉద్దేశ్యం కూడా అదేనని పరోక్షంగా చెప్పకనే చెప్పేసింది.

    Leave a Reply