• December 7, 2021

Samantha : కుక్కలు అలా చేయవు.. మనుషులే చేస్తారు : సమంత

Samantha : కుక్కలు అలా చేయవు.. మనుషులే చేస్తారు : సమంత

    Samantha Ruth Prabhu సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. సమంతను ఫాలో అయ్యే వారికి ఆమె పెట్ హష్, సాష గురించి తెలిసే ఉంటుంది. హష్‌ను తన బిడ్డ, కొడుకు అంటూ సమంత చేసే హడావిడి అంతా ఇంతా ఉండదు. అయితే సమంత హష్‌ను పెంచుకుని మూడేళ్లు అవుతుంది. మొన్నే హష్‌కు మూడేళ్లు నిండాయ్. బర్త్ డే సెలెబ్రేషన్స్ కూడా గ్రాండ్‌గానే చేసింది.

    అయితే హష్‌తో పాటు మరో పెట్‌ను కూడా సమంత తీసుకొచ్చింది. ఆ రెండు పెట్స్‌కు మొదట్లో పడటం లేదని, ఫైటింగ్ చేసుకుంటాయని సమంత తన స్టోరీల్లో చూపించేది. అయితే త్వరగానే ఫ్రెండ్స్‌గా మారాయని, కలిసి ఉంటున్నాయని చెప్పుకొచ్చింది. ఎంత కలిసి ఉన్నా కూడా ఫుడ్ విషయానికి వచ్చే సరికి మాత్రం, కారెట్ల విషయంలో గొడవలు పడుతుంటాయని చెప్పింది.

    తాజాగా సమంత ఓ ఫోటోను షేర్ చేసింది. కారులో వెళ్తోన్న సమంత.. తన రెండు పెట్స్‌ను చూపించింది. సమంత ఒళ్లో ఉన్న రెండు పెట్స్.. కారులోంచి బయటకు చూస్తున్నాయి. హష్ మీద సాష అలా వాలి ఉంది. ఆ రెండు పెట్స్ అలా క్యూట్‌గా ఒకదానిపై ఒకటి పడుకుని చూస్తుండటంతో ఆ ఫోటోపై నెటిజన్లు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.

    ఇక చిన్మయి భర్త రాహుల్ కూడా స్పందించాడు. ఓ అవి రెండు కలిసిపోయాయా? హష్‌ను తిట్టడం, అరిచేయడం సాష ఆపేసిందా? అని అడిగేశాడు. దానికి సమంత వెరైటీ సమాధానం ఇచ్చింది. అలాంటి పనులు కుక్కలు చేయవు.. మనం చేస్తాం.. ముందు తిడతాం.. తరువాత ప్రేమిస్తామంటూ నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేస్తూ రాహుల్‌కు రిప్లై ఇచ్చింది.

    Leave a Reply