- December 7, 2021
Samantha: ఓరీ దేవుడా.. అల్లు అర్జున్‌తో మామూలుగా లేదు : సమంత

Samantha సమంత ఇప్పుడు మంచి ఫాంలోకి వచ్చింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రెడీ అవుతోంది. ఆల్రెడీ యశోద అంటూ తన కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించేసింది. ఇక ఇప్పుడు పుష్ప స్పెషల్ సాంగ్ షూట్‌లోనూ రచ్చ చేస్తోంది. అయితే సమంత తాజాగా తన స్పెసల్ సాంగ్ గురించి కామెంట్ చేసింది. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ సమంత చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
సమంత ఫ్యామిలీ మెన్ సీజన్ 2తో దేశ వ్యాప్తంగా ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. రాజీ పాత్రలో సమంత చేసిన యాక్టింగ్‌కు అంతా ఫిదా అయ్యారు. బోల్డ్, యాక్షన్ అలా ప్రతీ సీన్‌లో సమంత ఇరగ్గొట్టేసింది. అలాంటి ఇంటెన్స్ రోల్ నుంచి ఇప్పుడు పుష్పలో స్పెషల్ సాంగ్ చేసే వరకు సమంత తన ఫీలింగ్ గురించి చెప్పింది.
రాజీ పాత్ర ఎంతో చాలెంజింగ్‌గా అనిపించింది. అందులో ఎంతో వేధన అనుభవించి, రాటుదేలిన అమ్మాయిలా కనిపిస్తుంది. అయితే పుష్పలో చేస్తోన్న సాంగ్ గురించి ఇప్పుడే చెప్పలేను. అందుకే ఇంకా షూట్ జరుగుతోంది. ఓమై గాడ్.. అల్లు అర్జున్‌తో కలిసి డ్యాన్స్ వేయాలంటే మామూలు విషయం కాదు అని సమంత చెప్పేసింది.
అంటే ఈ ఐటం సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే జానీ మాస్టర్ డేట్లు అడ్జస్ట్ కాకపోవడంతో తప్పుకున్నాడట. శేఖర్ మాస్టర్ స్టెప్పుల్లో కొత్తదనం లేదని పక్కన పెట్టేశారట. ఈ పాట కోసం బాలీవుడ్ నుంచి గణేష్ ఆచార్యను దించారట.