• November 6, 2021

ఆకాశపుటంచున ఆశ్రిత!.. వెంకీమామ కూతురి దెబ్బకు సమంత ఫిదా.. ఈసారి ఎలా?

ఆకాశపుటంచున ఆశ్రిత!.. వెంకీమామ కూతురి దెబ్బకు సమంత ఫిదా.. ఈసారి ఎలా?

    విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రిత దగ్గుబాటి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. స్పెయిన్‌లో ఉండే ఆశ్రిత.. సోషల్ మీడియాలో మరింత దూకుడుగా ఉంటుంది. సమంత, రానాల పోస్ట్‌లకు ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. తాజాగా ఆశ్రిత తన బర్త్ డే గురించి చెప్పుకొచ్చింది. ఇంకో వారంలోనే తన బర్త్ డే ఉందంటూతన ఫాలోవర్లను కొన్ని సలహాలు, సూచనలు అడిగింది. ఇంతకీ ఆ కథ ఏంటంటే?

    ఇలా ఎత్తు నుంచి అంతకు మించి అనేలా చూసినప్పుడే మన జీవితంలో మార్పులు వస్తాయి. ఈ ఫోటో రెండేళ్ల క్రితం దిగింది. నాకు అప్పుడు 30 ఏళ్లు. నాకు బర్త్ డేను సెలెబ్రేట్ చేసుకోవడం అంతగా నచ్చదు. కానీ ఆనాడు ఓ నిర్ణయానికి వచ్చాను. ప్రతీ బర్త్ డేకు ఏదో ఒక అడ్వంచర్ చేయాలి.. ఇంతకు ముందు అలాంటిది ఎప్పుడూ చేసి ఉండకూడదు. కనీసం ఏదో ఒక వంటకం నేర్చుకోవడం అయినా పర్లేదు. కానీ ఏదో ఒకటి కొత్తది చేయాలని ఫిక్స్ అయ్యాను.

    ఇక మరో వారంలో నాకు 32 ఏళ్లు వస్తాయి. మీరు ఏదో ఒక సలహా ఇస్తే నేను దాన్ని కచ్చితంగా చేస్తాను. కొత్తది ఏదైనా సరే ట్రై చేస్తాను. అందుకే మీరంతా నాకు కొన్ని సూచనలు ఇవ్వాలి. నేను ఇది వరకు చేయనివి ఏవైనా సరే చెప్పండి. నేను నా బర్త్ డే నాడు చేస్తాను. అలా ఎవరొ కొందరు చెప్పిన వాటిని నేనే ర్యాండమ్‌గా సెలెక్ట్ చేసుకుంటాను. వారికి క్రిస్మస్ సందర్భంగా ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ఇస్తాను. ఇక మీకు కేవలం వారమే ఉంది.. త్వరగా చెప్పండి అంటూ వెంకీ మామ కూతురు పోస్ట్ చేసింది.

    మొత్తానికి వెంకీ మామ కూతురు మాత్రం మామూల్ది కాదు. ఇలా ఏదో ఒక సాహసం చేయాలని ఫిక్స్ అయినట్టుంది. మొత్తానికి ఆకాశపుటంచున ఉన్న ఆశ్రితను చూసిన సమంతలో కొన్ని కొత్త కోరికలు పుట్టేశాయి. తాను కూడా అలా ఆకాశంలో విహరించాలని ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది.

    Leave a Reply