• January 10, 2022

అలాంటి వారితోనే గడుపుతాను!.. సమంత అలవాట్లు ఇవే

అలాంటి వారితోనే గడుపుతాను!.. సమంత అలవాట్లు ఇవే

    Samantha Ruth Prabhu సమంత రోజంతా ఏం చేస్తుంది. ఎలా గడుపుతుంది.. ఎలా ఆలోచిస్తుంది.. తన ఇష్టాయిష్టాలేంటి? అని ఎంతోమంది తెలుసుకోవాలని అనుకుంటారు. సమంత తాజాగా ఓ నేషనల్ మీడియాతో ముచ్చటిస్తూ తన రోజు ఎలా మొదలవుతుంది.. ఏమేం చేస్తుందనే విషయాలన్నింటిని సమంత చెప్పుకొచ్చింది. తన ఏడు అలవాట్లు ఇవేనని కొన్ని విషయాలను చెప్పేసింది.

    నేను మార్నింగ్ పర్సన్‌ని. రోజు ఉదయాన్నే ఐదు గంటలకు నిద్రలేస్తాను. ప్రతీ రోజు ఉదయం డే గురించి ముందే ఆలోచిస్తాను. ఈ రోజంతా ఎలా ఉండబోతోందనేది అంచనా వేసుకుంటాను. ఇక నా డైట్ అంతా కూడా వెజిటేరియన్. వేగన్‌గా మారిపోయాను. ఇక నాకు కొంచెం సానుభూతి ఎక్కువే. నా పర్సనల్, సినీ కెరీర్‌లో అదెంతో నాకు ఎంత ఉపయోగపడింది.

    నేను నా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించేందుకు.. ఎదుటివారిని నిందించకుండా ఉండేందుకుఅదే ఉపయోగపడింది. నాలో ఉన్న ఆ గుణం ఎప్పటికీ అలా ఉండేందుకు నేను ప్రతీ రోజూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. నా ఫౌండేషన్, పిల్లల గురించి ఆలోచిస్తుంటాను. అదే నాలో బలాన్ని నింపుతుంది. ఈ లోకంలో సంపతీ, సానుభూతి అనేవి ఉండాలి.

    నేను ఎప్పుడూ కూడా దేన్ని మధ్యలో వదలను.. సాధించే వరకు వదలను.. నాకు చాలెంజింగ్ పనులు చేయడమే ఇష్టం. ఇదే నన్ను దృడంగా ఉంచే మంత్రం. నేను నాతోనే పోటి పెట్టుకుంటాను.. నా హద్దులను నేనే చెరిపేసుకుంటాను.. ఎవ్వరితోనూ పోటీ పడను.. జిమ్, సెట్ ఇలా ఎక్కడైనా సరే నన్ను నేను ముందుకు వెళ్లేలా చూసుకుంటాను.

    నన్ను నేను వృద్ది పరుచుకునేందుకు కొత్త కొత్త విషయాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తాను. రూంలో కూర్చుని ఉండటం నాకు నచ్చదు.. ఎవరైతే నాకు కొత్త విషయాలు నేర్పిస్తారో వారితోనే సమయం గడుపుతాను… అంటూ ఇలా సమంత తన అలవాట్ల గురించి జాతీయ మీడియాతో ముచ్చటించింది. మొత్తానికి సమంత మాత్రం తన ఫుల్ ఫోకస్‌ను కెరీర్ మీద పెట్టిందని అర్థమవుతోంది.

    Leave a Reply