- November 11, 2021
Samantha: వదిలేసి వెళ్లడంతో భోరున ఏడ్చేస్తున్న సమంత!

Samantha సమంత ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతూనే ఉంది. ఏదో ఒక విషయంలో సమంత హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఫిల్మ్ కాంపినేయ్ ది బెస్ట్ నటీనటుల్లో సమంత పేరు వచ్చింది. గోవాలో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్‌కు స్పీకర్‌గా సమంతకు ఆహ్వానం వచ్చింది. అలా అరుదైన గౌరవం సంపాదించుకున్న దక్షిణాది నటిగా సమంత నిలిచింది.
అలా సమంత ఎప్పుడూ ఏదో ఒక విషయంతోనే ట్రెండ్ అవుతూనే వస్తోంది. అయితే తాజాగా సమంత తన ఇన్ స్టాగ్రాంలో ఓ స్టోరీని పోస్ట్ చేసింది. అందులో భోరున ఏడుస్తున్న ఎమోజీలను షేర్ చేసింది. దానికి ఓ కారణం ఉంది. సమంతకు పెట్స్ అంటే ఎంతిష్టమో అందరికీ తెలిసింది. హష్‌ను తన బిడ్డగా భావిస్తుంది సమంత. ఇక ఈ మధ్యే సహస్ర అనే పెట్ వచ్చింది.
ఆ రెండూ కలిసి చేసే అల్లరిని సమంత ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది. మొదట్లో అవి రెండూ కూడా కలిసి ఉండేవి కావట. కానీ ఇప్పుడు మాత్రం ఎంతో ఫ్రెండ్లీగా ఉంటున్నాయట. కానీ కారెట్స్ మాత్రం పంచుకుని తినవు. ఆ విషయంలో గొడవ జరుగుతూనే ఉంటుందని సమంత తెలిపింది. తాజాగా ఒక్క రోజు పాటు వాటిని వదిలేసి వెళ్లిపోవాల్సి వస్తుందట. ఒక్కరోజు అంటూ తెగ మథన పడింది. భోరున ఏడుస్తున్న ఎమోజీలను సమంత షేర్ చేసింది.
ప్రస్తుతం సమంత ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నిస్తోందట. తెలుగు, తమిళంలో అయితే రెండు సినిమాలు ఓకే అయ్యాయి. ఇప్పుడు సమంత తన రెమ్యూనరేషన్‌ను పెంచేసిందట. దాదాపు మూడు కోట్ల వరకు సమంత తీసుకుంటుందని తెలుస్తోంది.