- November 13, 2021
Samantha: వేషధారణ అంతా మారింది!.. ఊపులో ఉన్న సమంత.. కారణం అదేనా?
Samantha సమంత ప్రస్తుతం మంచి ఊపులో ఉంది. పర్సనల్ విషయాలన్నీ కూడా పక్కన పెట్టేసింది. అది ఎందుకు చేస్తున్నావ్.. ఇది ఎందుకు చేస్తున్నావ్.. అది చేయొద్దు.. ఇది చేయొద్దు అని అడ్డు చెప్పేవారు.. హద్దులు గీసేవారు ఎవ్వరూ లేరు. నచ్చిన పనిని ఇష్టమొచ్చినట్టుగా చేసేయోచ్చు, అందుకే సమంత విడాకుల అనంతరం కొత్తగా రెక్కలు వచ్చిన పక్షిలా ఎగురుతూనే ఉంది.
ఒక్క చోట ఉండటం లేదు. ఒక వారం ఛార్ ధామ్ యాత్రను చుట్టి వచ్చింది, ఆ తరువాత దుబాయ్‌లో షికార్లు చేసింది. ఇక ఇప్పుడు చెన్నై, హైద్రాబాద్ అంటూ తిరుగుతోంది. అయితే సమంత ఇప్పుడు మాత్రం ఫుల్ ఫాంలో ఉంది. ఫ్యామిలీ మెన్ సీజన్ 2 సక్సెస్‌ను ఇంకా ఎంజాయ్ చేస్తోంది. ఆ సక్సెస్‌ను వాడుకుని బాలీవుడ్లో ప్రాజెక్ట్‌లు పట్టేయాలని సమంత ఫిక్స్ అయినట్టుంది.
ఆల్రెడీ ఎప్పుడో వచ్చినా కూడా ఫ్యామిలీ కోసం పిల్లలను కనాలనే ఉద్దేశ్యంతోనే ఆ ఆఫర్లను తిరస్కరించిందని సాధన సింగ్ పేర్కొంది. అయితే ఇప్పుడు మాత్రం బాలీవుడ్ ప్రాజెక్ట్‌ల కోసం సమంత ప్రయత్నాలు చేస్తోన్నట్టు కనిపిస్తోంది. అందుకే దానికి తగ్గట్టుగా వేషధారణ మార్చినట్టు కనిపిస్తోంది. సమంత తాజాగా తన బాల్కనీ చిందులు వేసింది.
పిచ్చిపిచ్చిగా సంతోషంగా ఉన్నట్టు గెంతులు వేసింది. పొట్టి డ్రెస్సులో, పొట్టి జుట్టుతో, వెరైటీ హెయిర్ స్టైల్లో సమంత కనిపించింది. తన కొత్త సినిమాకు సంబంధించిన లుక్కో ఏమో తెలియడం లేదు గానీ సమంత మాత్రం కొత్తగా కనిపించింది.