• August 3, 2023

‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ మూవీ రివ్యూ.. సినిమాకు అదే బలం

‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ మూవీ రివ్యూ.. సినిమాకు అదే బలం

    Krishna Gadu Ante Oka Range Movie Review ప్రతీ వారం ఎన్నో ప్రేమకథలు వస్తుంటాయి. పోతుంటాయి. అయితే ప్రేమ కథలకు కాస్త డిఫరెంట్ జానర్లను టచ్ చేయడంతో కొత్త ఫ్లేవర్ వస్తుంది. లవ్ స్టోరీకి, సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ వంటి వాటిని యాడ్ చేసిన తీస్తే ఇంకాస్త ఇంట్రెస్ట్ పెరగుతుంటుంది. అలానే కొత్త దర్శకుడు రాజేష్ దొండపాటి ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ అనే సినిమాను తెరకెక్కించాడు. రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా పెట్లా ర‌ఘురామ్‌ మూర్తి ఈ సినిమాను నిర్మించాడు. మరి ఈ సినిమా సంగతి ఏంటో ఓ సారి చూద్దాం.

    కథ
    సొంతిళ్లు కట్టుకోవాలనే ఓ మధ్య తరగతి కుటుంబం. ఆ కుటుంబ పెద్ద రోడ్డు ప్రమాదంలో మరణిస్తాడు. అలాంటి కుటుంబం నుంచి వస్తాడు కృష్ణ (రిష్వి తిమ్మరాజు) అనే కుర్రాడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో అంతా తానై పెంచుతుంది తల్లి. తల్లిచాటు బిడ్డలా కృష్ణ పెరుగుతాడు. అదే ఊర్లో ఉండే బంధువుల అమ్మాయి సత్య (విస్మయ)ను చూసి ప్రేమలో పడతాడు. సత్య సైతం కృష్ణ మంచి మనసును ఇష్టపడుతుంటుంది. వీరి ప్రేమకు అదే ఊర్లో అల్లరిచిల్లరగా తిరిగే ఓ కామాంధుడు దేవా అడ్డుపడతాడు. ఆ తరువాత సత్య, కృష్ణలా జీవితాలు ఎలా మలుపు తిరిగాయి? తండ్రి కలను కొడుకు నెరవేర్చాడా? సొంతింటిని కట్టుకున్నాడా? ఊర్లో జరిగే దోపిడీలు, హత్యలను ఎవరు చేస్తుంటారు? అసలు కృష్ణ తన సమస్యలను ఎలా పరిష్కరించుకున్నాడు? అనేది కథ.

    నటీనటులు
    కృష్ణ పాత్రలో రిష్వి చక్కగా నటించాడు. పల్లెటూరి కుర్రాడు, మన పక్కింటి అబ్బాయిలానే కనిపిస్తాడు రిష్వి. ఈ సినిమాలో రిష్వి ఎంతో సహజంగా నటించాడు. అన్ని ఎమోషన్స్‌ను పలికించే ప్రయత్నం చేశాడు. విస్మయ పోషించిన సత్య పాత్ర ప్రేక్షకులకు బాగానే గుర్తుండిపోతుంది. అందంగా కనిపించడమే కాకుండా.. నటనతోనూ మెప్పించింది. విలన్లుగా కనిపించిన దేవా, మల్లయ్యన్న పాత్రలు బాగానే ఉన్నాయి. తాగుబోతులు, తిరుగుబోతులుగా కనిపించిన మిత్రత్రయం పాత్రలు బాగున్నాయి. హీరో తల్లి, మామ పాత్రలు కూడా మెప్పిస్తాయి.

    విశ్లేషణ
    లవ్ స్టోరీలకు హీరో హీరోయిన్ల జంటను జనాలు ఎక్కువగా చూస్తుంటారు. అలా ఈ కథలో కృష్ణ, సత్య పాత్రల్లో రిష్వి తిమ్మిరాజు, విస్మయ చక్కగా నటించారు. ఈ ఇద్దరి జోడి బాగుంటుంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు యూత్‌ను ఆకట్టుకునేలా ఉంటాయి. ఫస్ట్ హాఫ్‌ను లైటర్ వేలో తీసుకెళ్లేందుకు దర్శకుడు కథను సింపుల్‌గా రాసుకున్నట్టు అనిపిస్తుంది. ఓ లవ్ సీన్, ఓ కామెడీ సీన్, ఓ భయపెట్టే సీన్ అన్నట్టుగా సింపుల్‌గా అర్థమయ్యేట్టుగా రాసుకుంటూ పోయాడు.

    సెకండాఫ్ అంతా కూడా ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుంటుంది. హీరో కష్టాల పాలవ్వడం, వాటి నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేయడం, ఈ మధ్యలో ఓ ట్విస్ట్ రావడం అలా సాగుతూ పోతుంది. క్లైమాక్స్ కాస్త లెంగ్తీగా అనిపిస్తుంది. కానీ నాచురాలిటీకి దగ్గరగా ఉండటంతో జనాలకు కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

    ఈ సినిమాకు పాటలు ప్రాణంగా నిలుస్తాయి. అన్ని ట్యూన్స్ ఎంతో వినసొంపుగా ఉంటాయి. సాహిత్యం కూడా చక్కగా ఉంటుంది. మాటలు హత్తుకుంటాయి. ఫైట్స్ సహజంగా అనిపిస్తాయి. కెమెరావర్క్ అద్బుతంగా అనిపిస్తుంది. ఎడిటర్ చక్కని పని తీరుని కనబరిచారు. నిర్మాత పెట్టిన ప్రతీ పైసాకు ప్రయోజనం కలిగింది. నిర్మాణ విలువలు గొప్పగా అనిపిస్తాయి.

    రేటింగ్ : 3