• August 23, 2024

రేవు రివ్యూ.. ఆకట్టుకునే రియలిస్టిక్ అప్రోచ్

రేవు రివ్యూ.. ఆకట్టుకునే రియలిస్టిక్ అప్రోచ్

    వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘రేవు’. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్ పై నిర్మాత డా.మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మించారు. నిర్మాణ సూపర్ విజన్‌గా జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరించారు. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ చిత్రం ఆగస్ట్ 23న రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

    తీర ప్రాంతంలో నివసించే మత్స్యకారుల జీవితాల గురించి రేవులో చూపించారు. “రేవు” సముద్రతీర గ్రామమైన పాలరేవులో అంకాలు (వంశీ రామ్ పెండ్యాల), గంగయ్య (అజయ్) అనే ఇద్దరు మత్స్యకారుల మధ్య ప్రతీ విషయంలో పోటీ ఉంటుంది. ధనవంతుడు, పవర్ ఉన్న వ్యక్తి నాగేసు (యేపూరి హరి) రాకతో వారి జీవితాలు ఊహించని మలుపు తిరుగుతాయి. ఊరిలోని ప్రశాంత వాతావరణం పోయి.. గొడవలకు కారణం అవుతుంది. వాటి వల్ల సామ్రాజ్యం (స్వాతి భీమి రెడ్డి), సామ శివ (సుమేష్ మాధవన్), సదా శివ (హేమంత్ ఉద్భవ్), భూషణ్ (లీలా వెంకటేష్ కొమ్ములి) జీవితాలనపై ప్రభావితం చేస్తుంది. చివరకు రేవులో జరిగే కొట్లాట ఏంటి? దాని కారణంగా ఎవరికి ఏం జరుగుతంది? ఎవరు లాభపడతారు.. చివరకు ఎలా ముస్తుంది? అన్నది థియేటర్లో చూడాల్సిందే.

    వంశీ రామ్ పెండ్యాల మత్స్యకారుడిగా సహజమైన నటనను అందించాడు. అతని వ్యక్తీకరణలు, ముఖ్యంగా అతని కళ్ళ ద్వారా పలికించిన భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. అజయ్ తన పాత్రలో ఇమిడిపోయాడు. వీరిద్దరి మధ్య వచ్చే శక్తివంతమైన నటన సన్నివేశాలు సినిమాను ఎలివేట్ చేస్తుంది. వీరిద్దరి నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి. స్వాతి భీమి రెడ్డి అద్భుతంగా నటించగా, ఏపూరి హరి ప్రతినాయకుడిగా మెప్పించాడు. సుమేష్ మాధవన్, హేమంత్ ఉద్భవ్.. చక్కగా నటించారు. లీలా వెంకటేష్ కొమ్ములి తన పరిధిలో మంచి నటనను ప్రదర్శించి మెరిసింది.

    గంగమ్మ తల్లిని నమ్మకున్న గంగపుత్రులు (మత్స్యకారులు) జీవితాల్లో జరిగే సంఘటనల సమాహారమే ‘రేవు’ సినిమా కథ. ఈ సందర్బంగా సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లే వాళ్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఎలా నిలబిడ్డారనే కథాంశమే ‘రేవు’ మూవీ స్టోరీ. ఈ క్రమంలో ఇద్దరు స్నేహతులు మధ్య వచ్చిన ఈగోతో వీరు ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేసారనేది దర్శకుడు ఎంతో ఎమోషనల్ గా తెరపై ఆవిష్కరించారు.

    ఈ క్రమంలో ఇద్దరు స్నేహతులు మధ్య వచ్చిన ఈగోతో వీరు ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేసారనేది దర్శకుడు ఎంతో ఎమోషనల్ గా తెరపై ఆవిష్కరించారు. అంతేకాదు సముద్రంలోకి వెళ్లే మత్స్య కారుల జీవితాలు అక్కడి తుఫానుల కారణంగా ఎలాంటి అలజడులకు లోనైవుతాయి. ఈ క్రమంలో వాళ్ల కుటుంబ సభ్యులు ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తారనేది మంచిగా ఎగ్జిక్యూట్ చేసాడు దర్శకుడు. సినిమాలో పాత్రల పరిచయాలు.. ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులను సీట్లపై కదలనీయదు.

    ఎక్కడా కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఫీలింగ్ ఉండదు. ప్రీ క్లైమాక్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. పాటలు సో, సో గా ఉన్నా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునే విధంగా ఉంది.

    రేటింగ్ 3