- August 23, 2024
ధీరన్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన “సాలా” సినిమాకు బెస్ట్ విషెస్ అందించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ధీరన్ హీరోగా నిర్మించిన తమిళ మూవీ “సాలా”. ఈ సినిమా నేడు గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా సాలా సినిమాకు తన బెస్ట్ విషెస్ అందించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తన మిత్రుడు టీజీ విశ్వప్రసాద్‌కు సాలా సినిమా కోలీవుడ్ లో బిగ్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని అల్లు అర్జున్ కోరారు.
హీరో ధీరన్, హీరోయిన్ రేష్మ వెంకటేష్, ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, డైరెక్టర్ ఎస్ డీ మణిపాల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను మీట్ అయ్యారు. సాలా సినిమాను రాయపురంలోని ఫేమస్ పార్వతీ బార్ నేపథ్యంతో యాక్షన్ డ్రామాగా దర్శకుడు ఎస్ డీ మణిపాల్ రూపొందించారు.
నటీనటులు – ధీరన్, రేష్మ వెంకటేష్, చార్లెస్ వినోద్, శ్రీనాథ్, అరుల్ దాస్, సంపత్ రామ్, అల్ అజీనా, అతులథ్, తదితరులు
టెక్నికల్ టీమ్:
దర్శకత్వం – ఎస్ డీ మణిపాల్
ప్రొడ్యూసర్ – టీజీ విశ్వప్రసాద్
కో ప్రొడ్యూసర్ – వివేక్ కూఛిబొట్ల
బ్యానర్ – పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సినిమాటోగ్రఫీ – రవీంద్రనాథ్ గురు
మ్యూజిక్ – టీసన్
ఎడిటర్ – భువన్