• November 17, 2021

Renu Desai : నాకేం కాలేదు.. బాగానే ఉన్నాను : రేణూ దేశాయ్

Renu Desai : నాకేం కాలేదు.. బాగానే ఉన్నాను : రేణూ దేశాయ్

    Renu Desai రేణూ దేశాయ్ ఈ మధ్య సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. గత నెల రోజుల నుంచి రేణూ దేశాయ్‌కి సంబంధించిన విషయాలేవీ బయటకు రాలేదు. రేణూ దేశాయ్‌కి ఏమై ఉంటందా? ఏమైనా సమస్యలు వచ్చాయా? ఆరోగ్యం బాగా లేదా? అసలేమైంది? అంటూ ఆమె అభిమానులు, నెటిజన్లు ఆందోళన చెందారు. అక్టోబర్ మొదటి వారంలో చివరి పోస్ట్ చేసిన రేణూ దేశాయ్ మళ్లీ ఇప్పుడు పోస్ట్ చేసింది. అలా ఒక్కసారిగా రేణూ దేశాయ్ కనిపించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

    ఆ ఫోటోలో ఉత్తేజ్ కుమార్ పాట ఉత్తేజ్ ఉంది.వెనకాల ఆద్య ఉంది. మధ్యలో రేణూ దేశాయ్ నవ్వుతూ కనిపిస్తోంది. ఈ ఫోటోను చూస్తుంటే ఉత్తేజ్ పెద్ద కూతురు చేతన సీమంతం వేడుకలకు సంబంధించినది అని అనిపిస్తోంది. మొత్తానికి పాట ఉత్తేజ్ అకిరా, ఆద్యలతో ఎంత క్లోజ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకే ఇలా చేతన సీమంతం వేడుకల్లో రేణూ దేశాయ్ పాల్గొని ఉంటుంది.తాజాగా రేణూ దేశాయ్ చేసిన పోస్ట్, చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

    ఉత్తేజ్ కూతురు పాట ఉత్తేజ్‌ను రీల్ లైఫ్ హీరోగా అంటూ ఆద్యను రియల్ లైఫ్ హీరో అంటూ రేణూ దేశాయ్ పేర్కొంది. అలా ఇద్దరితో కలిసి దిగిన సెల్ఫీని రేణూ దేశాయ్ షేర్ చేసింది. ఇన్ స్టాగ్రాం నుంచి కాస్త లాంగ్ బ్రేక్ తీసుకున్నాను అంతే. నాకేం కాలేదు.. బాగానే ఉన్నాను. ఆరోగ్యంగానే ఉన్నాను. నా హెల్త కోసం మీరు చేసిన మెసెజ్‌లు, నా కోసం మీరు పడ్డ తాపత్రయానికి థ్యాంక్స్ అని రేణూ దేశాయ్ క్లారిటీ ఇచ్చింది. ఇక చీర గురించి చెబుతూ తరువాత మరో కామెంట్ చేసింది ధృవ్ దేశాయ్‌కి ఆ చీర క్రెడిట్ ఇచ్చేసింది.

    Leave a Reply