- November 11, 2021
విజయ్ దేవరకొండ మీద ప్రేమను చాటింది!.. రష్మిక మందన్నా పోస్ట్ వైరల్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కెమిస్ట్రీ స్క్రీన్ మీద ఎంతగా వర్కవుట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి అన్యోన్యతను చూసి నెటింట్లో రకరకాల రూమర్లు మొదలయ్యాయి. ఇక దేవరకొండ ఇంట్లో రష్మిక మందాన్న ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. విజయ్ దేవరకొండ తల్లితో రష్మిక మందాన్న ఎంతో క్లోజ్‌గా ఉంటుంది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలతో ఈ ఇద్దరి జోడికి విపరీతమైన క్రేజ్, పాపులారిటీ వచ్చింది.
దాంతో పాటే కొన్ని రూమర్లు కూడా వచ్చాయి. ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని అనుకున్నారు. కాని వారిది కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమేనని సన్నిహితులు చెబుతుంటారు. అయితే మొత్తానికి ఇప్పుడు దేవరకొండ బ్రదర్స్ తమ లక్‌ను పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. పుష్పక విమానం సినిమాతో ఇద్దరు అన్నదమ్ములకు ఇది పరీక్షే. హీరోగా ఆనంద్ దేవరకొండ, నిర్మాతగా విజయ్ దేవరకొండ పుష్పక విమానం సినిమాతో ప్రయోగం చేస్తున్నాడు.
నవంబర్ 12న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అంటే రేపు రిలీజ్ కాబోతోన్న ఈ చిత్రానికి తన వంతుగా సాయం చేసి విజయ్ మీదున్న ప్రేమను చాటుకుంది. ట్రైలర్ గురించి రష్మిక మందన్నా పోస్ట్ చేసింది. బ్లడీ హిలేరియస్ అంటూ ట్రైలర్ గురించి ప్రశంసలు కురిపించింది. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్. రేపు, రేపటి నుంచి ఇక ముందు ఈ సినిమా విజయవంతంగా ముందుకు వెళ్లాలి. దేవరకొండ బాయ్స్‌కు ఆల్ ది బెస్ట్ అని చెప్పుకొచ్చింది. నేను దేని గురించి మాట్లాడుతున్నానో అర్థం కాకపోతే ఇది చూడండి అంటూ ట్రైలర్ లింక్ పెట్టేసింది.