- January 18, 2022
Ram Gopal Varma : స్టార్ కపుల్స్ డైవర్స్.. గుడ్ ట్రెండ్ అంటోన్న ఆర్జీవీ

Dhanush Aishwarya Divorce రామ్ గోపాల్ వర్మకు పెళ్లి అంటే గిట్టదన్న సంగతి తెలిసిందే. పెళ్లి వద్దు కానీ మిగతావన్నీ కావాలనే టైపు మన వర్మ. అయితే ఈ మధ్య స్టార్ కపుల్స్ విడాకులతో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆమిర్ ఖాన్ కిరణ్ రావుల విడాకుల నుంచి సమంత నాగ చైతన్య డైవర్స్ ఇష్యూలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్అవుతున్నాయో అందరికీ తెలిసిందే.
ఇలా స్టార్ కపుల్స్ మధ్య ఎందుకు జరుగుతోంది? అనే విషయాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు. అసలు ఈ వివాహా బంధాలు కూలిపోతోన్నాయి. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు ఎందుకు ఇలా మధ్యలో బ్రేకప్ చెప్పుకుని, విడాకులు తీసుకుంటున్నాయో అర్థం కావడం లేదు. అయితే ఆర్జీవీ మాత్రం తన పైత్యాన్ని మరోసారి జనాల మీద రుద్దేందుకు వచ్చాడు.
ఐశ్వర్యా రజనీకాంత్, ధనుష్ విడాకుల నేపథ్యంలో వర్మ సంచలన కామెంట్స్ చేశాడు. స్టార్ కపుల్స్ డైవర్స్ అనేది ఓ గుడ్ ట్రెండ్.. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న యువతకు వార్నింగ్ బెల్ లాంటిది.. పెళ్లి అంటే ఎంత డేంజర్ అన్నది వారికి అర్థమవుతుంది. ప్రేమను పెళ్లి కంటే ఏదీ చంపదు.. సంతోషం ఉండటానికి ఒకే ఒక మార్గం ఉంటుంది. ఇష్టమున్నంత వరకు ఒకరిని ప్రేమించాలి.. ఆ తరువాత మరొకరిని ప్రేమించాలి.. అంతేకానీ ఇలా పెళ్లి అనే జైలుకు వెళ్లకూడదు.
పెళ్లితో ప్రేమ అనేది త్వరగా చచ్చిపోతుంది. పెళ్లి కోసం చేసే మూడు, ఐదు రోజులసెలెబ్రేషన్స్ కంటే తక్కువ రోజుల్లోనే ప్రేమ చచ్చిపోతుంది. తెలివైనవాళ్లు ప్రేమిస్తారు.. మూర్ఖులే పెళ్లి చేసుకుంటారు.. ఇలా విడాకుల ద్వారా స్వేచ్చ లభిస్తుంది కాబట్టి.. సంగీత్ ఈవెంట్‌తో గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకోవాలి.. వారి డేంజర్ క్వాలిటీస్‌ను పెళ్లితో టెస్ట్ చేస్తారు కదా? అందుకే పెళ్లిని సీక్రెట్‌గా చేయాల్సి ఉంటుంది.. పెళ్లి అనేది తప్పు.. ఇది మన పూర్వీకులు పని లేకుండా పెట్టారు.. ఈ పెళ్లి వల్ల ఎప్పటికీ బాధలు, దు:ఖాలే ఏర్పడుతుంటాయి..అని ఇలా వరుసగా ట్వీట్లతో రచ్చ చేశాడు వర్మ.