- January 18, 2022
Karthika Deepam నేటి ఎపిసోడ్.. అత్తా కోడళ్లు వాయించారు.. రుద్రాణికి దెబ్బ మీద దెబ్బ
కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే మంగళవారం అంటే జనవరి 18న ప్రసారం కానున్న Karthika Deepam Episode 1252 ధారావాహికలో అదిరిపోయే సీన్ వచ్చింది. రుద్రాణి చెంప మీద మొదటి దెబ్బ దీప కొడితే.. రెండోదెబ్బ సౌందర్యది అయింది. అలా మొత్తానికి రుద్రాణికి అత్తాకోడళ్ల చేతుల్లో దెబ్బ మీద దెబ్బ పడ్డట్టు అయింది. మొత్తానికి కార్తీక దీపం నేటి ఎపిసోడ్ సాఫీగా సాగిపోయింది.
పిల్లలు రుద్రాణి మనుషులు స్కూల్‌కు వచ్చారని దీపతో చెబుతూ భయపడుతుంటారు. ఆవిడ ఎందుకు అలా చేస్తోందంటూ పిల్లలు అడుగుతారు. రుద్రాణి అప్పు తీర్చేసి ఈ ఊరి నుంచి ఎలాగైనా వెళ్లిపోవాలని దీప అనుకుంటుంది. కార్తీక్ తన తల్లిదండ్రులను చూసి బాధపడుతూ వెనుదిరిగి వస్తాడు. వాళ్లకు ఇలాంటి పరిస్థితి రావడానికి తానే కారణమని కుమిలిపోతాడు. కళ్ల ముందున్నా కూడా పలకరించలేకపోయాను అని బాధపడుతుంటాడు. ఇక రుద్రాణికిచ్చిన పార్శిల్‌ను అప్పిగాడికి అప్పజెప్పుతాడు.
ఇక మోనిత మరో వైపు విన్నికి అన్నీ నూరిపోస్తుంది. మిమ్మల్ని చూస్తే భయం వేస్తోంది.. బస్తీ వాళ్లంతా కూడా మీ గురించి చెప్పిన విషయాలు తలుచుకుంటూ ఉంటే భయంగా ఉంది మేడం అని విన్ని అంటుంది. ఈ జనాలు రోజుకో రకంగా మారుతుంటారు.. వారిని నువ్ పట్టించుకోవద్దు.. నీ మనసుకు ఏం అనిపిస్తుందో అదే నమ్ము.. అయినా నన్ను అర్థం చేసుకోవడాకి చాలా టైం పడుతుంది అని మోనిత అంటుంది.
ఇక మరో వైపు రుద్రాణి రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు బయల్దేరుతుంది. దారి మధ్యలో అబ్బులు గాడు ప్రకృతి వైద్యశాలల మందులు తీసుకుంటాను అని చెబుతాడు. కానీ అక్కడ అబ్బులు ఆలస్యం చేస్తుంటాడు. సౌందర్య, ఆనంద్ రావులకు అక్కడి గురువు దాన్యం నేర్పిస్తుంటాడు. ద్యానం గీనం లేదు.. అక్కడ అక్క వెయిట్ చేస్తుంది మందులు ఇవ్వండని అబ్బులు అంటాడు. ఇంతలో రుద్రాణి కూడా వస్తుంది. కాస్త నోరు జారడంతో.. రుద్రాణి చెంప చెల్లుమనిపిస్తుంది సౌందర్య.
ఇది రెండో సారి.. నా గురించి తెలియకుండా నువ్ నన్ను కొట్టావ్.. తెలిసి కొట్టినా తెలియక కొట్టినా తప్పే నీ అంతు చూస్తాను అని రుద్రాణి అంటుంది. నీలాంటి వికృత మనుషులకు ఇలాంటి చోటకు వచ్చే అర్హత లేదు అంటూ రుద్రాణిని చీ కొడుతుంది. అలా రుద్రాణి బయటకు వస్తుంది. ఇక మరో వైపు దీప నడుచుకుంటూ వస్తుంది. రోడ్డు మీద రుద్రాణి కారు అడ్డదిడ్డంగా పోతుంది.
దీంతో దీపకు చిర్రెత్తుకొస్తుంది. తిడుతుంది. అబ్బులు కాస్త ఓవర్ యాక్షన్ చేయడంతో. దీప చాచి కొడుతుంది. మర్యాదగా మాట్లాడు.. రోడ్డు మీద జాగ్రత్తగా నడుపు అని చెబుతుంది. దీంతో పక్కనుండే ఒకడు.. అసలు విషయం చెబుతాడు. రుద్రాణి అక్కకు ఒకరు వాయినం ఇచ్చారు.. మీరు ఇప్పుడు అబ్బులుకు వాయినం ఇచ్చారు అని అంటాడు. దీంతో రుద్రాణి కారు దిగి వస్తుంది.
ఏంటి చెంప మీద చేయి పెట్టుకున్నారు అని దీప అడుగుతుంది. పంటి నొప్పి అని రుద్రాణి కవర్ చేస్తుంది. మా ఇంటికి వచ్చినప్పుడు కూడా పంటినొప్పి వచ్చినట్టుంది కదా? అని నాటి విషయాన్ని దీప గుర్తు చేస్తుంది. అలా మొత్తానికి దీప చేతిలో రుద్రాణికి మరోసారి పరాభవం ఎదురవుతుంది. ఇక రుద్రాణిని కొట్టిన వ్యక్తిని చూడాలని ప్రకృతి వైద్య శాలకు వెళ్తుంది దీప.
ఇంటికి వచ్చిన కార్తీక్‌తో జరిగిన విషయాన్ని పిల్లలు చెబుతారు. రుద్రాణికి వార్నింగ్ ఇవ్వాలని కార్తీక్ బయల్దేరుతాడు. మరో వైపు రుద్రాణిని కొట్టినవారిని చూసేందుకు దీప ప్రకృతి వైద్య శాలకు వస్తుంది. ఆమెను కొట్టి తప్పు చేశావేమో.. కొత్త ప్రదేశం కదా? అని సౌందర్యతో ఆనంద్ రావు అంటాడు. దీప కూడా లోపలకు వస్తుంది. అలా మొత్తానికి ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో దీప తన అత్తమామలను చూస్తుంది. అక్కడేమో రుద్రాణికి కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.
- Tags
- Deepa
- Doctor Babu
- Karthika Deepam
- Karthika Deepam Episode
- Karthika Deepam Episode 1252
- karthika deepam latest episode
- Karthika Deepam new Episode 1252
- karthika deepam serial today
- Karthika Deepam serial today episode
- Karthika Deepam Today Episode
- Karthika Deepam today Episode 1252
- Monitha
- Premi Viswanath
- Vantalakka
- కార్తీక దీపం
- కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్
- కార్తీక దీపం ఈరోజుది
- కార్తీక దీపం ఎపిసోడ్
- కార్తీక దీపం టుడే ఎపిసోడ్
- కార్తీక దీపం డైలీ సీరియల్
- కార్తీక దీపం నిన్నటి ఎపిసోడ్
- కార్తీక దీపం నేటి ఎపిసోడ్
- కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్
- కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్
- కార్తీకదీపం నేటి ఎపిసోడ్
- కార్తీకదీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్
- కార్తీక్
- దీప
- మోనిత
- వంటలక్క