- December 28, 2021
Sukumarతో రామ్ చరణ్.. ఎంట్రీ సీన్ గుట్టు విప్పి అంచనాలు పెంచిన రాజమౌళి

Ram Charan Rajamouli రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలం సినిమాలో ఓ మైలురాయిగా మిగిలిపోయింది. అటు సుకుమార్ కెరీర్, ఇటు రామ్ చరణ్ కెరీర్‌కు రంగస్థలం అనే ఓ అగ్ మార్క్‌లా మారింది. చాలా రోజులు తరువాత ఇండస్ట్రీ హిట్ అంటే టాలీవుడ్ చూసింది. వారం, రెండు వారాలు ఆడటమే కష్టమైన రోజుల్లో కూడా రంగస్థలం వంద రోజులు ఆడింది. అదీ సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్‌కు ఉన్న సత్తా.
అయితే ఈ ఇద్దరూ మళ్లీ కలిసి రాబోతోన్నారనే వార్తలు ఈ మధ్య తెరపైకి వచ్చాయి. ఎందుకంటే పుష్ప ప్రమోషన్స్‌లో సుకుమార్ కొన్ని విషయాలు చెప్పాడు. పుష్ప ది రూల్ పూర్తయిన తరువాత విజయ్ దేవరకొండతో ఓ సినిమా ఉంటుందని చెప్పాడు. అయితే రామ్ చరణ్‌తో ఓ ప్రాజెక్ట్ చర్చల్లో ఉందని సుకుమార్ చెప్పాడు. ఇంకా కథ ఓకే కాలేదని కూడా సుకుమార్ అన్నాడు.
అయితే తాజాగా రాజమౌళి ఇచ్చిన హింట్‌తో అసలు విషయం బయటకు వచ్చింది. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ సెట్ అయిందని చెప్పకనే చెప్పేశాడు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో రాజమౌళి మాట్లాడుతూ సుకుమార్ రామ్ చరణ్ సినిమా ఎంట్రీ సీన్ గురించి హింట్ ఇచ్చాడు. జక్కన్న మాటలతో చెర్రీ ఫ్యాన్స్ పండుగ చేసేసుకుంటున్నారు.
Rajamouli about #Ramcharan Sukumar movie opening sequence.. Huiii 💥 pic.twitter.com/eia2Ep2wY8
— Sk (@sk_jalsa) December 27, 2021
సుకుమార్ రామ్ చరణ్ మూవీ ఎంట్రీ సీన్ నాకు తెలుసు.. ఇప్పుడు అది రివీల్ చేయనులే. చేస్తే సుకుమార్‌కు గుండె బద్దలవుతుంది.. ఇంత వరకు అలాంటి హార్డ్ హిట్టింగ్ ఎంట్రీ సీన్ చూసి ఉండరు.. ప్రేక్షకులు అయితే సీట్లో కూర్చోలేరు.. పిచ్చెక్కిపోతారు అంటూ రాజమౌళి చెప్పేశాడు. దీంతో సినిమా మీద ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ ఇద్దరి సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్తుందో.. ఆ మరు ఏడాది ప్రారంభం అవుతుందో చూడాలి.