• December 12, 2021

Pushpa The Rise : ‘పుష్ప’ ఐటం సాంగ్‌లో పస లేదు!.. కాపీ మరకలతో ట్రోల్స్

Pushpa The Rise : ‘పుష్ప’ ఐటం సాంగ్‌లో పస లేదు!.. కాపీ మరకలతో ట్రోల్స్

    oo antava oo oo antava అల్లు అర్జున్ పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్, సిజిలింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ వాళ్లది వాళ్లే ప్రమోట్ చేసుకున్నారు. సుకుమార్ దేవీ శ్రీ ప్రసాద్ అంటే ఐటం సాంగ్ అదిరిపోతుందని అంతా భావించారు. దీనికి తోడు వాళ్లు చేసుకున్న ప్రమోషన్స్ కూడా వీర లెవెల్లో ఉన్నాయి. కానీ తీరా సాంగ్ చూస్తే అందరి గాలిపోయింది. సమంత ఈ సాంగ్‌ను చేస్తోందన్న ఒక్క ప్రత్యేకత తప్పా.. పాటలో, ట్యూన్‌లో ఎలాంటి కొత్తదనం లేదు.

    మొత్తానికి ఊ అంటావా ఊ ఊ అంటావా అనే పాటలో పస లేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అసలు దేవీ శ్రీ ప్రసాద్ కొట్టే ఐటం సాంగ్‌లో ఎలాంటి ఊపు ఉంటుంది.. ఇందులో అది మిస్ అయిందని.. పాట అంత ప్రభావం చూపించలేదని అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే ఇప్పుడు ఈ పాట మీద కాపీ మరకలు అంటాయి.

    అసలే తమన్ ఇలాంటి దెబ్బలు ఎన్నో తిని ఉన్నాడు. దేవీ శ్రీ ప్రసాద్‌కు పుష్ప సినిమా కీలకం. ఎందుకంటే ఇప్పుడు తమన్ హవాకు అడ్డు కట్ట వేయాలంటే పుష్పతో దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి తన సత్తాను చాటాల్సి ఉంది. కానీ పుష్ప సాంగ్స్ మాత్రం ఆ స్థాయిలో ఉండటం లేదు. చివరగా వచ్చిన ఈ ఐటం సాంగ్ మొత్తం గాలి తీసేసింది. ఈ పాట ఒరిజినల్ ట్యూన్‌ను నెటిజన్లు దొరకపట్టేశారు.

    పుష్ప ఐటం సాంగ్ సూర్య సినిమాలోని ఓ పాటకు దగ్గరగా ఉందని అంటున్నారు. సూర్య హీరోగా వచ్చిన వీడొక్కడే సినిమాలోని హనీ హనీ అనే పాట ట్యూన్‌‌కు కాపీలా ఉందని ట్రోల్స్, మీమ్స్‌తో రచ్చ చేస్తున్నారు. మొత్తానికి ఈ పాట మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదన్నది మాత్రం సత్యం. ఇక తెరపై విజువల్‌గా ఎలా ఉంటుందో చూడాలి. పాట మీద ఎన్ని ట్రోల్స్ వచ్చినా కాపీ ఆరోపణలు వచ్చినా కూడా యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్‌లతో దూసుకుపోతోంది.

    Leave a Reply