- October 20, 2021
ఫ్లాష్ బ్యాక్ : ప్రభాస్ అలా చేయడంతో హర్ట్ అయ్యా.. నోరు విప్పిన పూరి జగన్నాథ్

పూరి జగన్నాథ్, ప్రభాస్ కాంబినేషన్ అంటే అందరికీ బుజ్జిగాడు సినిమా గుర్తుకు వస్తుంది. అప్పటి వరకు ప్రభాస్‌ను చూపించని విధంగా సరికొత్త బాడీ లాంగ్వేజ్, డైలాగ్ మాడ్యులేషన్‌లో పూరి చూపించాడు. అయితే సినిమా ఫలితం ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన బుజ్జిగాడు చిత్రం దారుణంగా బెడిసి కొట్టేసింది. కానీ పూరి ప్రభాస్ కాంబినేషన్‌కు మంచి మార్కులే పడ్డాయి.ఇక అందులో డార్లింగ్ అంటూ ప్రభాస్ పలికే ఊత పదం ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.
ఆ డార్లింగ్ అనే పదానికి ఫ్లాష్ బ్యాక్ ఉందట. పూరిని మొదటగా ప్రభాస్ కలిసినప్పుడు డార్లింగ్ డార్లింగ్ అనేవాడట. ఎందుకో తెలీదు గానీ అప్పటి నుంచి అందరినీ డార్లింగ్ డార్లింగ్ అని పిలవడం ప్రభాస్ ప్రారంభించాడట. ఎందుకు అలా అనడం స్టార్ట్ చేశానో కూడా తనకు తెలీదని ప్రభాస్ అన్నాడు. అయితే తనను మాత్రమే అలా డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తాన్నాడేమో అని పూరి జగన్నాథ్ తెగ సంబరపడిపోయాడట.
ఆ డార్లింగ్ పదం బాగుంది.. పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయని ఆ డైలాగ్‌ను సినిమాలో పెట్టాలా? అని ప్రభాస్‌తో పూరి అన్నాడట. పెట్టేయ్ డార్లింగ్ అని ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అందుకే బుజ్జిగాడులో డార్లింగ్ అనే పదాన్ని వాడేశాడు. అయితే సెట్‌లోకి వచ్చిన తరువాత ప్రభాస్ తన కారు డ్రైవర్ నుంచి ప్రతీ ఒక్కరినీ డార్లింగ్ అని పిలుస్తున్నాడట. అది చూసి పూరి జగన్నాథ్ తెగ హర్ట్ అయ్యాడట. తనను మాత్రమే అలా పిలుస్తున్నాడని అనుకున్నా.. కానీ ప్రతీ ఒక్కరినీ అలానే పిలుస్తాడని తెలిసి హర్ట్ అయ్యానని ప్రభాస్ గురించి పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చాడు. ఈ విషయాలన్నీ కూడా నిన్న రొమాంటిక్ మూవీ ట్రైలర్‌ను ప్రభాస్ విడుదల చేసిన సందర్భంలో గుర్తు చేసుకున్నారు.