• October 20, 2021

Bigg Boss 5 Telugu : రెచ్చిపోయిన ప్రియ.. ఉడికిపోయిన సన్నీ

Bigg Boss 5 Telugu : రెచ్చిపోయిన ప్రియ.. ఉడికిపోయిన సన్నీ

    బిగ్ బాస్ ఇంట్లో ఏడో వారం అదిరిపోతోంది. నామినేషన్ ప్రక్రియలోనే ఎన్నో ట్విస్టులు వచ్చాయి. నామినేట్ చేసింది ప్రియ.. నామినేట్ అయింది యాంకర్ రవి. కానీ అది సన్నీ మెడకు చుట్టుకుంది.అలా సన్నీ ఇరుక్కుపోవాలనే ఉద్దేశ్యంతోనే ప్రియ గేమ్ ఆడింది. ప్రియ దెబ్బకు రవి బలైనా కూడా సన్నీ మాత్రం దారుణంగా బుక్కయ్యాడు. అలా సన్నీ ప్రియ మధ్య ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీ వార్ జరుగుతూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే.

    ఇక నిన్న బంగారు కోడిపెట్ట ఆటలోనూ ఈ ఇద్దరి మధ్య ఫన్నీ సంభాషణలు జరిగాయి. సన్నీని దారుణంగా ఉడికించింది ప్రియ. సన్నీ స్టైల్లోనే వెక్కిరిస్తూ ఎగతాళి చేస్తూ ప్రియ డైలాగ్‌లు కొట్టేసింది. నేను ఇలానే ఆడతా.. నా ఆటే ఆడుతా.. నా ఇష్టమొచ్చినట్టు ఆడతా.. దొంగతనాలు చేస్తా అంటూ ప్రియ కౌంటర్లు వేసింది. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్‌లో ప్రియనే హైలెట్ అయింది. ఇక సన్నీని ప్రియ బాగానే రెచ్చగొట్టేసింది. మాటలతో దాడికి దిగింది.

    గడ్డి పోచ లాంటి వాడివి అని సింబాలిక్‌గా ప్రియ చెప్పేసింది. ఉగ్రరూపం చూస్తావ్ అంటూ సన్నీ బెదిరించిగా.. నీలాంటి వాళ్లను మస్తుగా చూశా అంటూ ప్రియ మరింతగా రెచ్చగొట్టేసింది. అయితే అదంతా నిన్న మాటల వరకు సాగింది.కానీ ఈ రోజు ఎపిసోడ్‌లో మాత్రం అది ఇంకాస్త ముందుకు వెళ్లినట్టు.. ఒకరిపై ఒకరు దాడికి దిగేలా కనిపిస్తోంది. చెంపపగులుద్దంటూ ప్రియ.. కొట్టేందుకు మీద మీదకు వచ్చేశాడు సన్నీ. మొత్తానికి ఈ ఇద్దరి మధ్య నేటి ఎపిసోడ్‌లో రచ్చ రంబోలా అయ్యేలా ఉంది.

    Leave a Reply