- July 31, 2022
Heroes Remunerations : టాలీవుడ్ బంద్.. ఎవరికి నష్టం, ఎవరికి కష్టం?

Tollywood Shootings అమ్మో ఒకటో తారీఖు అని టాలీవుడ్ జనాలు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి టాలీవుడ్‌లో షూటింగ్లు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ప్రొడ్యూసర్స్ గిల్డ్, ఫిల్మ్ ఛాంబర్ నుంచి ప్రకటనలు వచ్చాయి. అయితే ఈ షూటింగ్‌లను ఆపేయడం వల్ల ఏం జరుగుతుంది? ఎవరు నష్టపోతారు? ఎవరికి కష్టాలు వస్తాయ్ అనేది ఎవ్వరూ ఊహించుకోలేకపోతోన్నారు.
ఎక్కడైనా డబ్బులు పెట్టే వారిదో అగ్రస్థానం, ఆదిపత్యం ఉంటాయి. సినిమాలు నిర్మించేది నిర్మాతలే. వారే సినిమా పరిశ్రమకు వెన్నుముకలాంటి వారు. అలాంటి నిర్మాతలే ఇలాంటి బంద్‌లకు పిలుపునిస్తే ఎవరు నష్టపోతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయినా షూటింగ్‌లను బంద్ చేస్తే నష్టపోయేది నిర్మాతలే. ఆ నష్టానికి సిద్దమై ఇలా బంద్‌కు పిలుపునిచ్చారు.
సరే బంద్‌కు పిలుపునిచ్చారు. వారి సమస్యలను తీర్చాల్సింది ఎవరు?.. నిర్మాతలే అందరి సమస్యలను తీర్చాల్సి ఉంటుంది. అలాంటి నిర్మాతలే సమస్యలు ఉన్నాయ్ మొర్రో అని అంటున్నారు. వారి గోడును వినేవారు ఎవరు? పరిష్కరించేవారు ఎవరు. నిర్మాతలంతా ఏకత్రాటిపైకి రావాలి. వారిలో వారు కొన్ని కఠిని నియమాలు, నిబంధనలు ఏర్పర్చుకోవాలి. కానీ కొందరు మాత్రం వాటిని పట్టించుకోరు. కాంబినేషన్‌లను సెట్ చేయడం కోసం అడ్వాన్స్‌లు ఇవ్వడం, ఎక్కువ రెమ్యూనరేషన్‌లు ఆఫర్ చేయడం, అన్ని వసతులు వారి వద్దకే తీసుకురావడం వంటి చేస్తుంటారు.
ఇకపై అలాంటి వాటికి అడ్డుకట్ట వేసుకోవాలి. నిర్మాతలంతా కూడా స్వయం నియంత్రణ పాటించుకోవాలి. నిర్మాతలంతా కలిసి ఎవరెవరికి? ఎంతెంత రెమ్యూనరేషన్స్ ఇవ్వాలో ఓ నిర్ణయానికి రావాలి. ఇక సినిమా నిర్మాణ వ్యయం, టైమింగ్స్ వంటి వాటిలో నిర్మాతలంతా కలిసి నిబంధనలు పెట్టాలి. ఊరికే ఓటీటీ మీద పడి ఏడ్వడం కంటే.. సినిమా టికెట్లను సాధారణ జనాలకు అందు బాటులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి.
నిర్మాతలంతా బంద్‌కు సహకరించారు. నష్టాన్ని భరిస్తారు. అంత వరకు బాగానే ఉంది. కానీ రోజూ పని చేస్తే గానీ పూట గడవని సినీ కార్మికుల సంగతి ఏంటి? అనేది మాత్రం ఏ ఒక్కరూ కూడా పట్టించుకోవడం లేదు.