• July 31, 2022

Magadheera వచ్చి 13 ఏళ్లు.. ఈ విశేషాలు తెలుసా?

Magadheera వచ్చి 13 ఏళ్లు.. ఈ విశేషాలు తెలుసా?

Magadheera completes 13 years మగధీర సినిమా 2009వ సంవత్సరంలో జూలై 30న విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం విడుదలై 13 ఏళ్లు అవుతోంది. అయితే ఈ సినిమా విశేషాలు ఎన్నెన్నో ఇది వరకు ఎంతగానో ట్రెండ్ అయ్యాయి. ఫైటింగ్ సీన్స్‌లో గాయాలు.. సాంగ్స్ షూటింగ్ విశేషాలు, గుర్రపు స్వారీలు ఇలా ఈ సినిమా ప్రయాణంలో ఎన్నెన్నో విశేషాలున్నాయి.

 

మగధీర సినిమా రామ్ చరణ్ సినీ కెరీర్‌ను ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేసింది. రాజమౌళి రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అప్పటి వరకు తెలియని, వినని వసూళ్లను సాధించింది. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా దాదాపు రూ. 150 కోట్లు ఆ కాలంలోనే కొల్లగొట్టేసింది.

 

రామ్ చరణ్ ఎంట్రీ సీన్, బైక్ స్టంట్స్ చేసే సమయంలో షూటింగ్ ఆపాల్సి వచ్చింది. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్‌కు ల్యాండింగ్ సీన్ సమయంలో గాయమైందట. బైక్ స్టంట్ చేసే సమయంలో కింద పడటంతో చేతులు, మొహానికి దెబ్బ తగిలాయట. ఆరు నెలలు బెడ్ రెస్ట్ కావాలని వైద్యులు అంటే. నెలలోపే లేచి తిరిగి వచ్చాడట. వచ్చి మిగతా సీన్లన్నీ కూడా తీసేశాడట.

 

ఇక ఇందులో సలోని పాత్రకు ముందుగా.. అర్చనను అనుకున్నారట. కానీ ఆమె డేట్స్ కారణాల వల్ల పాత్రను మిస్ అయింది. ఇక శ్రీహరి పాత్రకు ఎంతో స్పెషల్‌గా రాజమౌళి డిజైన్ చేశాడట. రామ్ చరణ్ హెయిర్ స్టైల్ కోసం ఎంతో జాగ్రత్తలు తీసుకున్నారట. న్యాచురల్‌గానే చరణ్ హెయిర్స్ బాగుంటాయట. అందుకే ఎక్కువగా కష్టపడాల్సి రాలేందంటూ రమా రాజమౌళి అన్నారు.

 

ఇక ఈ సినిమా సెట్స్ మీదున్న సమయంలోనే.. కొన్ని పోస్టర్లను విడుదల చేశారు. దాంట్లో భాగంగా ధీరుడు అనే టైటిల్‌ను రివీల్ చేశారు. కానీ చివరకు ఆ టైటిల్ కాస్తా.. మగధీరగా మారిపోయింది. ఇందులో ధీర ధీర సాంగ్ కోసం ఎన్నో వేల మంది స్టూడెంట్స్‌తో కీరవాణి కోరస్ పాడించాడట. ఆ పాటకు నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక కాజల్‌కు టాలీవుడ్‌లో మహారాణి యోగాన్ని తీసుకొచ్చింది మగధీర చిత్రం. ఇక అభిమానులు నెట్టింట్లో #13YrsOfHistoricIHMagadheera అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.