• October 26, 2021

దొరికిందే చాన్స్ అనుకుందా?.. శ్రీరామచంద్రకు ప్రియాంక ముద్దులు

దొరికిందే చాన్స్ అనుకుందా?.. శ్రీరామచంద్రకు ప్రియాంక ముద్దులు

    బిగ్ బాస్ ఇంట్లో ప్రియాంక సింగ్‌కు మంచి పేరు వచ్చింది. ఇంటా బయట ఆమెకు మంచి ఆదరణ దక్కింది. అయితే ఒక్కోసారి ఆమె ప్రవర్తన కూడా ఎవ్వరికీ అంతు చిక్కదు. అబ్బాయి నుంచి అమ్మాయిలా మారింది.. ఎన్నో కష్టాలను పడుతోంది..పైగా ఎంతో పద్దతిగా ఉంటుంది అనే కారణాలతో జనాల్లో ఆమె మీద సింపతి ఏర్పడింది. బిగ్ బాస్ ఇంట్లోఅందరినీ చక్కగా చూసుకోవడం, అందరితోనూ బాగా ఉంటూ వస్తోంది. అయితే బిగ్ బాస్ షో మొదట్లో అయితే ప్రియాంక ఓ ఇద్దరి మీద ఇంట్రెస్ట్ చూపించింది.

    మానస్, శ్రీరామచంద్ర అంటే ప్రియాంక కాస్త ఇంట్రెస్ట్ చూపించేది. అందరినీ అన్నయ్య అంటూ ప్రేమగా పిలిచి ప్రియాంక.. ఆ ఇద్దరిని మాత్రం పేరు పెట్టి పిలిచేది. ఇక ప్రారంభంలో అయితే ఈ ముగ్గురి మధ్య ఉన్న ట్రాక్ గురించి ఇంటి సభ్యుల కౌంటర్లు వేసుకుంటూ ఉండేవారు. కానీ మధ్యలో ఎక్కువగా మానస్ వైపు వెళ్లిపోయింది ప్రియాంక. ఈ ఇంట్లో ఎవరికైనా రాఖీ కట్టేస్తా..అన్నయ్య అని పిలుస్తా.. చివరకు శ్రీరామచంద్రను కూడా అన్నయ్య అని పిలుస్తాను. నిన్ను మాత్రం పిలవను అంటూ మానస్ మీదున్న ప్రేమను ప్రియాంక పరోక్షంగా బయటపెట్టింది.

    మానస్ అంటూ ప్రియాంకకు ఇష్టమన్న సంగతి తెలిసిపోతోంది. కానీ బయటపడదు. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులు అందరూ ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే వారి ఇంటి నుంచి లెటర్స్ వచ్చాయి. ఎవరో కొందరికి వస్తాయి.. కొందరికి రావు. అలా లెటర్స్ అందని వారు నామినేట్ అవుతారు. అయితే శ్రీరామచంద్ర తనర ఇంటి నుంచి వచ్చిన లెటర్ చూసి కంటతడి పెట్టేస్తాడు. మొదటి సారి శ్రీరామ్ ఏడవడం చూసి ఆనీ మాస్టర్, ప్రియాంక షాక్ అవుతారు.

    ఏడ్వొద్దు.. నువ్ చాలా స్ట్రాంగ్ కదా? అని ఆనీ మాస్టర్ ఓదార్చుతుంటుంటే.. ప్రియాంక ముద్దుల వర్షం కురిపిస్తుంది. అటు చెంప మీద ఇటు చెంప మీద ముద్దులు పెడుతుంది. ఊరుకో అని అంటుంది. అలా ప్రియాంక ముద్దులు పెడుతుంటే.. ఆనీ మాస్టర్ కౌంటర్ వేసింది. దొరికిందే చాన్స్ అనుకుని ముద్దులు పెట్టేస్తున్నావా? అని ప్రియాంక మీద కౌంటర్లు వేసింది.

    Leave a Reply