• October 27, 2021

Bigg Boss 5 Telugu : ముగ్గురు బావల ముద్దుల మరదలు.. ప్రియాంక కొంటె చేష్టలు

Bigg Boss 5 Telugu : ముగ్గురు బావల ముద్దుల మరదలు.. ప్రియాంక కొంటె చేష్టలు

    బిగ్ బాస్ ఇంట్లో ప్రియాంక సింగ్‌ వ్యవహారం ఎవ్వరికీ అంతగా అంతుపట్టదు. ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా చెప్పడం కుదరదు. ఎక్కువగా మానస్‌తోనే ఉండే ప్రియాంక.. అప్పుడప్పుడు శ్రీరామచంద్రపైనా మనసు పారేసుకుంటుంది. ఇంట్లో దాదాపు అందరినీ అన్నయ్య అంటూ ప్రేమగా పిలుస్తుంది. కానీ శ్రీరామచంద్ర, మానస్‌లను మాత్రం పేరు పెట్టి పిలుస్తుంది. ఇక ఈ మధ్య ఈ ట్రాక్లోకి జెస్సీ కూడా వచ్చినట్టు కనిపిస్తోంది.

    జెస్సీని కూడా ప్రియాంక అన్నయ్య అని పిలవదు. అయితే జెస్సీకి తాను అంటే చాలా ఇష్టమని ప్రియాంక చెప్పుకుంది. నిన్నటి ఎపిసోడ్‌లో ప్రియాంక మరీ సిగ్గు విడిచి ముగ్గురు బావలున్నారని తెలిపింది. రవి అన్నయ్య, లోబో అన్నయ్య అంటూ పెద్ద బావ, చిన్న బావ, బుల్లి బావ అంటూ ముగ్గురి గురించి ప్రియాంక చెప్పింది. పెద్ద బావ అంటే మానస్, చిన్న బావ అంటే శ్రీరామచంద్ర, బుల్లి బావ అంటే జెస్సీ అని లోబోకు అర్థమయ్యేలా రవి వివరించాడు.

    జెస్సీ ఎప్పుడు వచ్చాడు? వాడు కూడా ఉన్నాడా? అని లోబో ఆశ్చర్యపోయాడు. ఇక లోబో అయితే లోకల్ బావలు నాకు వద్దు.. నేను నిన్ను బాగా చూసుకుంటాను.. చెల్లెమ్మ.. నేను నిన్ను పోషిస్తాను అని ప్రియాంకకు లోబో భరోసా ఇచ్చాడు. మానస్ మంచి బావ అని లోబోకు ప్రియాంక చెప్పడం.. మానస్ అయితే చాలా మంచివాడు.. చెప్పింది వింటాడు నాకు ఓకే అని లోబో అనడం, నీక్కూడా కావాల్సింది మానస్ బావే కదా? అని రవి, లోబోలు ఇద్దరూ ఒకేసారి కౌంటర్లు వేశారు.

    Leave a Reply