• October 13, 2024

నూతన్ నాయుడుకి పితృ వియోగం

నూతన్ నాయుడుకి  పితృ వియోగం

    ఉత్తరాంధ్ర కాంగ్రెస్ సీనియర్ నేత, బిగ్ బాస్ ఫేం నూతన్ నాయుడు తండ్రి సన్యాసి రావు నాయుడు ఈరోజు(12-10-2024) దివంగతులయ్యారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. సన్యాసి రావు నాయుడు గారు మృతి పట్ల పలువురు తమ దిగ్బ్రాంతిని వ్యక్తంచేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.