• October 12, 2024

దసరా సందర్భంగా అమరావతి టూరింగ్ టాకీస్ బ్యానర్‌‌పై విశ్వ కార్తికేయ కొత్త చిత్రం ప్రారంభం

దసరా సందర్భంగా అమరావతి టూరింగ్ టాకీస్ బ్యానర్‌‌పై విశ్వ కార్తికేయ కొత్త చిత్రం ప్రారంభం

    విశ్వ కార్తికేయ నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కలియుగం పట్ణణంలో సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కారు. విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ జంటగా మరో చిత్రం రాబోతోంది. దసరా సందర్భంగా ఈ కొత్త మూవీని ప్రారంభించారు. శనివారం నాడు గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు జరిగాయి. అమరావతి టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై విశ్వ కార్తికేయ ఏడో చిత్రం రాబోతోంది.

    విశ్వ కార్తికేయ సరసన ఆయుషి పటేల్ నటించనుంది. ముహూర్తం సన్నివేశానికి ముఖ్య అతిథులు హీరో సుమన్ క్లాప్ కొట్టారు. సీనియర్ డైరెక్టర్ కాశీ విశ్వనాథ్ గారు గౌరవ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ చంద్ర మహేష్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. సీనియర్ దర్శకులు సముద్ర, సి.ఎల్. శ్రీనివాస్ గారు, కోటిబాబు గారు స్క్రిప్ట్‌ను అందించారు. మిగిలిన వివరాలను చిత్రయూనిట్ త్వరలోనే ప్రకటించనుంది.

    ఈ చిత్రానికి పోలాకి విజయ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా పని చేయనున్నారు. యెలేందర్ మహావీర్ సంగీతాన్ని అందించనుండగా.. కిషోర్ బోయిడపు కెమెరామెన్‌గా పని చేయనున్నారు. తారక్ (ఎన్టీఆర్) ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

    నటీనటులు : విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ తదితరులు

    సాంకేతిక సిబ్బంది
    కథ & నిర్మాణం : అమరావతి టూరింగ్ టాకీస్
    దర్శకుడు : పి.చలపతి
    కెమెరామెన్ : కిషోర్ బోయిడపు
    సంగీత దర్శకుడు : యెలేందర్ మహావీర్
    ఎడిటర్ : తారక్ (ఎన్టీఆర్)
    ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, నందు
    నృత్యం : పోలాకి విజయ్
    PRO : సాయి సతీష్