- October 30, 2021
Bigg Boss 5 Telugu : కంటెస్టెంట్లకు ఓట్లు వేసిన నిహారిక

బిగ్ బాస్ ఐదో సీజన్‌లో శుక్రవారం జరిగినంత చెత్త ఎపిసోడ్ ఎప్పుడూ జరగలేదు. చూపించడానికి ఏమీ లేదో ఏమో గానీ బిగ్ బాస్ టీం నిన్న విసుగు తెప్పించింది. ఎంత సేపు అదే చూపించారు. సంచాలక్‌గా జెస్సీ చేసిన దాని గురించి మానస్, సన్నీ మాట్లాడుకున్నారు. ఇక ఏదో పిచ్చి టాస్కులు ఇచ్చాడు బిగ్ బాస్. మొత్తానికి యాడ్స్ గురించి ప్రమోట్ చేసే ఎపిసోడ్‌లా మారింది. ముందు వావ్ తాజ్ అంటూ రచ్చ చేశారు. ఆ తరువాత హయర్ ఫ్రిడ్జ్ గురించి ఓ టాస్క్ పెట్టారు.
అలా శుక్రవారం నాటి ఎపిసోడ్ మరింత నీరసంగా సాగింది. అసలే షో ఫ్లాపు అయింది. వీకెండ్‌లో మరింత ఘోరంగా రేటింగ్స్ వస్తుంది. ఇక వీక్ డేస్‌లో అయితే మరింత వీక్‌గా ఉంటుంది. రెండు మూడు పాయింట్ల రేటింగ్ తెచ్చుకోవడానికి నానా కష్టాలు పడుతోంది. అలాంటి షో మీద సెలెబ్రిటీలు మాత్రం ఇంట్రెస్ట్‌గానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ వారం నిహారిక, దీప్తి సునయన, రాహుల్ సిప్లిగంజ్, కార్తీకదీపం హిమ ఫేమ్ సహృద వంటి వారు ఓట్లు వేసినట్టు కనిపిస్తోంది.
బిగ్ బాస్ ఇన్ స్టా పేజిలో వారంతా కూడా ఓట్లు వేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆ పేజ్ వాళ్లు.. నిహారిక, సహృద, రాహుల్, అరియానా, దీప్తి సునయనలకు థ్యాంక్స్ చెప్పారు. అయితే వీరు ఎవరికి ఓటు వేసి ఉంటారో తెలియడం లేదు. నిహారిక ఎవరికి సపోర్ట్ చేస్తుందనేది ఆసక్తి కరంగా మారింది. అసలే ఈ వారం ఇంటి సభ్యుల్లో సిరి, రవి, లోబో, శ్రీరాచంద్ర, షన్ను, మానస్ వంటి వారున్నారు. మరి వీరిలో నిహారిక ఎవరి ఓటు వేసి ఉంటుందో.