- December 6, 2021
Akhanda : ఇదొక్క ఫోటో చాలు.. బాలయ్య డెడికేషన్ వేరే లెవెల్

Nandamuri Balakrishna నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో బాక్సాఫీస్ మీద దాడి చేస్తున్నాడు. డిసెంబర్ 2న విడుదలై అఖండ సినిమా ఇప్పటికీ దుమ్ములేపుతూనే ఉంది. ఇక థియేటర్లకు జనాలు వస్తారా? సినిమాలు చూస్తారా? మూసధోరణి సినిమాకు కాలం చెల్లిపోయిందా? కమర్షియల్ సినిమాల పని అయిపోయిందా? అంటూ ఇలా ఎన్నెన్నో అనుమానాలు జనాల్లో ఉండేవి.
కానీ బాలయ్య అఖండ సినిమాతో అవన్నీ పటాపంచెలయ్యాయి. అఖండ సినిమా ఇప్పుడు థియేటర్లలో దుమ్ములేపుతోంది. మాస్ జాతర నడుస్తోంది. విడుదలైన ప్రతీ చోటా హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఆన్ లైన్‌లో బుక్ చేద్దామని చూస్తే క్షణాల్లో నిండిపోతోన్నాయి. అంతగా బాలయ్య అఖండతో రచ్చ చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా అఖండ సినిమాలో అఘోర పాత్ర, ఆ కారెక్టర్ కోసం స్పెషల్‌గా డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
అయితే ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను దాదాపు 60 నుంచి 65 రోజులు షూట్ చేశారట. ప్రతీ సీక్వెన్స్‌లో దాదాపు 20 మంది ఉండేవారట. ఇక క్లైమాక్స్ షూట్ కోసం వందమంది ఫైట్ మాస్టర్లను పట్టుకొచ్చారట. అలా మొత్తానికి స్టంట్ శివ కంపోజ్ చేసిన ఈ ఫైట్స్‌లో బాలయ్య బాగానే కష్టపడ్డాడు. ఒళ్లు హూనం చేసుకున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఓ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
అందులో బాలయ్య తన టీంతో కాస్త రిలాక్స్ అవుతున్నాడు. అందులో అఘోరా గెటప్‌లో కనిపిస్తున్నాడు. ఆ ఫోటోలో బాలయ్య కాళు బాగానే వాచిపోయింది. మైనింగ్ ఏరియాలో ఆ యాక్షన్ సీక్వెన్స్ చేయడం, ఎండకు అలా ఉండి ఉండి బాలయ్య కాలు మొత్తం వాపెక్కింది. అయినా కూడా బాలయ్య మాత్రం నవ్వుతూనే కనిపిస్తున్నాడు. ఈ వయసులో కూడా ఆ డెడికేషన్ ఏంటని నెటిజన్లు అవాక్కవుతున్నారు.