• November 2, 2021

Balakrishna: హాస్పిటల్‌లో బాలయ్య.. ఆందోళనలో అభిమానులు.. అసలు కథ ఏంటంటే?

Balakrishna: హాస్పిటల్‌లో బాలయ్య.. ఆందోళనలో అభిమానులు.. అసలు కథ ఏంటంటే?

    Balakrishna నంద‌మూరి బాల‌కృష్ణ అభిమానులు ఆందోళన చెందే విషయం ఒకటి బయటకు వచ్చింది. తాజాగా బాలయ్య బాబు హాస్పిటల్‌లో చేరాడన్న సంగతి తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలేం జరిగి ఉంటుందా? అని ఆరా తీస్తున్నారు. ఏమైనా సీరియస్ ఇష్యునా? అని తెగ బాధపడుతున్నారు. అయితే తాజాగా బాలయ్య హెల్త్ అప్డేట్ వచ్చింది

    బాలయ్య కేర్ ఆస్ప‌త్రిలో చేరాడట. బాల‌కృష్ణ‌కు కుడి భుజం నొప్పి తీవ్రం కావ‌డంతో సోమ‌వారం కేర్ ఆస్ప‌త్రిలో జాయిన్ అయ్యాడని తెలుస్తోంది. డాక్ట‌ర్ ర‌ఘువీర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో కేర్ ఆస్ప‌త్రి వైద్యుల బృందం బాల‌కృష్ణ‌కు సుమారు 4 గంట‌ల పాటు స‌ర్జ‌రీ చేసిందట. అయితే అభిమానులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని డాక్ట‌ర్లు వెల్ల‌డించారు.

    త్వ‌ర‌లోనే బాల‌కృష్ణ ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అవుతార‌ని డాక్ట‌ర్లు తెలిపారు. బాల‌కృష్ణ‌కు ఆరు వారాల‌పాటు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని తెలిపారు. ప్రస్తుతం బాలయ్య ఫుల్ బిజీగా ఉన్నాడు. ఓ వైపు అఖండ షూటింగ్‌లో, మరో వైపు ఆహా అన్ స్టాపబుల్ షూటింగ్‌తో బాలయ్య ఫుల్ హడావిడి చేస్తున్నాడు. అయితే ఈ భుజం నొప్పి ఎందుకు వచ్చిందినేది క్లారిటీగా తెలియడం లేదు.

    Leave a Reply