• October 24, 2021

ఎంత సాగదీస్తే అంత దొరికిపోతావ్!.. యాంకర్ రవికి నాగార్జున స్వీట్ వార్నింగ్

ఎంత సాగదీస్తే అంత దొరికిపోతావ్!.. యాంకర్ రవికి నాగార్జున స్వీట్ వార్నింగ్

    యాంకర్ రవికి ప్రతీ వారం ఏదో ఒక ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. యాంకర్ రవి చేసే పనులతో బయట ఇమేజ్ దారుణంగా పడిపోతోంది. రవి పీఆర్ టీం తెగ కష్టపడుతోంది. ఇమేజ్ బిల్డప్ చేసేందుకు కానీ అదేమీ వర్కవుట్ కావడం లేదు. బిగ్ బాస్ ఇంట్లో యాంకర్ రవి నిజంగానే గుంటనక్కలా ప్రవర్తిస్తున్నాడు. నటరాజ్ మాస్టర్ ఏ సమయాన ఆ పేరు పెట్టారో కానీ సరిగ్గా సరిపోయింది. తన అతి తెలివితో అందరినీ ప్రభావితం చేసి, అందరి ఆటను ఆడేయాలని చూస్తుంటాడు.

    చేసింది చేయలేదు అని చెప్పడం, మాటలు మార్చడం, అన్న మాటలే మళ్లీ అనలేదు అని ఫ్లిప్ అవ్వడం వంటివి రవికి నెగెటివ్ ఇమేజ్ తీసుకొస్తున్నాయి. అలా చేయడం వల్లే లహరి ప్రియ ఇష్యూలో రవి దోషిలా నిలబడాల్సి వచ్చింది. అమ్మతోడు అంటూ మరీ దారుణంగా అబద్దాలు ఆడేస్తున్నాడు. అలానే గత వారంలోనూ మళ్లీ ఓ అబద్దం ఆడాడు. సిరి స్టిక్కర్లు దొంగతనం చేసీ కూడా చేయలేదని అబద్దాలు ఆడాడు. అమ్మ మీద ఒట్టేయడంతో రవిని షన్ను గుడ్డిగా నమ్మాడు.

    దొంగతనం చేశాను ప్రియతో ఒప్పుకున్నాడు. అదే విషయాన్ని సిరి ముందు కూడా చెప్పాడు. తనకు ముందే తెలుసు అని సిరి చెప్పింది. కానీ నాగార్జున ముందు మాత్రం రవి ఒప్పుకోలేదు. తాను దొంగతనం చేయలేదు అని, దొరికితే తీసుకున్నాను అని లాజిక్ చెప్పాడు. దొరికితే తీసుకోవడం కూడా దొంగతనమే కదా? పైగా కాజల్ వద్ద కూడా దొంగతనం చేయమని సిరికి హింట్లు ఇచ్చావ్.. ఆట బాగానే ఆడుతున్నావ్ కానీ ఇలా మాటలు మార్చొద్దు అని చెప్పాడు. రవి ఏదో చెప్పబోతోంటే.. ఇలా సాగదీస్తుంటే ఇంకా దొరికిపోతావ్ అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.

    Leave a Reply