• October 24, 2021

పెరిగిన అగ్గిపెట్టే ధర.. ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతోందంటే?

పెరిగిన అగ్గిపెట్టే ధర.. ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతోందంటే?

    భారత్‌లో ప్రస్తుతం ధరలు ఎలా మండిపోతోన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెట్రోల్, డీజీల్ రేట్లు అయితే పాపం పెరిగినట్టు పెరుగుతోందని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. కొన్ని చోట్ల రూ. 110 దాటేసింది. పెట్రోల్, డీజీల్ కూడా సెంచరీ కొట్టేశాయని నెటిజన్లు మీమ్స్, ట్రోల్స్‌తో నానా హంగామా చేస్తున్నారు. అలా ప్రతీ వస్తువు రేటు పెరుగుతోంది. తాజాగా అగ్గిపెట్టె ధరలు కూడా పెరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు రూ.1 కే అగ్గిపెట్టే దొరికేది.

    కానీ ఇకపై ఆ ధరకు అగ్గిపెట్టే దొరకదు. అగ్గిపెట్టేను యాభై పైసల నుంచి ఒక్క రూపాయికి 2007లో పెంచగా.. మళ్లీ 14 ఏళ్లకు ఇలా పెంచేశారు. ఇప్పుడు ఒక్క రూపాయిని కాస్త రెండు రూపాయలు చేశారు. అలా మొత్తానికి డిసెంబర్ ఒకటి నుంచి అగ్గిపెట్టె ధర రూ. 2 కానుంది. అగ్గిపెట్టే తయారీలో కావాల్సిన ముడి సరుకుల ధరలు పెరగడంతోనే ఇలా పెంచాల్సి వస్తోందని తయారీ సంస్థలు చెబుతున్నాయి.

    Leave a Reply