• October 30, 2021

Bigg Boss 5 Telugu : అడిగిన దానికి మాత్రం చెప్పు.. సన్నీకి ఇచ్చిపడేసిన నాగ్

Bigg Boss 5 Telugu : అడిగిన దానికి మాత్రం చెప్పు.. సన్నీకి ఇచ్చిపడేసిన నాగ్

    బిగ్ బాస్ ఇంట్లో శనివారం వచ్చిందంటే చాలు క్లాసుల మీద క్లాసులు పడుతూనే ఉంటాయి. ఆ వారం మొత్తం ఏం చేశారు..ఎలా ప్రవర్తించారు.. ఎవరు ఎలా ఆడారు.. ఎవరి గ్రాఫ్ తగ్గింది.. ఎవరి గ్రాప్ పెరిగింది.. ఇలా అందరి లెక్కలు తేల్చేందుకు నాగార్జున వస్తాడు. అందరికీ ఇచ్చిపడేస్తాడు. అలా ఈ వారం నాగార్జున మంచి వేడి మీదున్నట్టు కనిపిస్తున్నాడు. ఒక్కొక్కడికి దారుణంగా రాడ్లు దింపేశాడు. మరీ ముఖ్యంగా తొట్టి గ్యాంగ్‌లా మారిపోయిన మానస్, సన్నీ, కాజల్‌కు మూమూలుగా ఇవ్వలేదు.

    ఎనిమిదో వారంలో ఈ ముగ్గురు కలిసే ఉన్నారు. ఇక మరీ ముఖ్యంగా టాస్కుల విషయంలో కాజల్, సన్నీ హద్దులు దాటేశారు. కెప్టెన్సీ కంటెండెర్స్ టాస్కులో సంచాలక్ నిర్ణయాన్ని సైతం తప్పు పట్టేశారు. అక్కడితే ఆగకుండా బస్తాలను తన్ని అవతల పారేశాడు. మొత్తానికి సన్నీ మాత్రం తన టెంపర్‌ను కోల్పోయాడు. టాస్కులో శ్రీరామ్ మీదకు వెళ్లాడు. ఇక బెస్ట్ వరెస్ట్ కంటెస్టెంట్ల గురించి చెబుతున్నప్పుడు జెస్సీ మీదకు వెళ్లేశాడు.

    నాగార్జున ఈసారి సన్నీ లెఫ్ట్ రైట్ వాయించినట్టు ప్రోమోలో కనిపిస్తోంది. ఎవరైనా సరే ఓ వస్తువును చేత్తో పట్టుకుంటే తన్నేయడం రైటా? అడిగిన దానికి చెప్పు అంటూ సన్నీని కడిగిపారేశాడు. ఎందుకు అంత మీద మీదకు వెళ్తున్నావ్.. నిన్ను ఎంత మంది ఆపాల్సి వచ్చిందో తెలుసా? అని సన్నీ పరువుతీసేశాడు. పద్దతిగా ఆడి గెలిస్తే బాగుంటుందని ఆత్రం కాజల్‌కు చురకలు వేశాడు. సంచాలక్ నిర్ణయం ఫైనల్.. అంటూ మానస్‌కు క్లారిటీగా చెప్పాడు నాగ్. మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ మంచి ఫైర్ మీద ఉండోబోతోన్నట్టు కనిపిస్తోంది.

     

    Leave a Reply