- October 28, 2021
Naga Shaurya: ప్రేమలో పడిపోయా.. అసలు గుట్టు విప్పిన నాగ శౌర్య

Naga Shaurya వరుడు కావలెను అనే సినిమా నాగ శౌర్య తన లక్‌ను పరీక్షించుకునేందుకు వస్తున్నాడు. ఈ క్రమంలోనే తన పాత సినిమాల ఫ్లాపుల్లోంచి బయటపడాలని అనుకుంటున్నాడు. కచ్చితంగా ఈ చిత్రం హిట్ అవుతుందని నాగ శౌర్య ఎంతో నమ్మకంతో చెప్పాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన కథను వివరిస్తూ కొన్ని విశేషాలను పంచుకున్నాడు.
ప్రతి ఇంట్లో చూసే కథేనని అన్నాడు. 30 ఏళ్లు దాటిన అబ్బాయి, అమ్మాయిలను పెళ్లి ఎప్పుడు? సంబంధాలు చూడాలా? అని అడగడం చాలా ఇబ్బందిగా ఉంటుందని అన్నాడు. అబ్బాయి, అమ్మాయి ఎంత వరకూ రెడీగా ఉన్నారు అన్నది ఆలోచించరని అని పేర్కొన్నాడు. ఇలాంటివి అన్నీ మనం వింటుంటాం. ఈ పాయింట్ జనాలకు బాగా రీచ్ అవుతుందని అంగీకరించాను అంటూ సినిమాలోని స్టోరీ లైన్ గురించి చెప్పేశాడు.
ఇది పక్కా యంగ్‌స్టర్స్ కథ పైగా మెచ్యుర్డ్ లవ్‌స్టోరీ అని నాగ శౌర్య అన్నాడు. ఇందులో రెండు ప్రేమకథలుంటాయని తెలిపాడు. పెళ్లి పీటల ముందు వరకూ జరిగే కథ ఇదని పేర్కొన్నాడు. ఈ సినిమా కోసం త్రివిక్రమ్‌గారు ఓ సీన్ రాశారట. ఆ సీన్‌లో తాను యాక్ట్ చేశానని, డైలాగ్‌లు చెప్పానని అన్నాడు. ఇందులో 15 నిమిషాల క్లైమాక్స్ ఉంటుందని. అది చాలా అద్భుతంగా వచ్చిందని అన్నాడు. ఆ సన్నివేశాలను అందరూ ఫ్రెష్‌గా ఫీలవుతారు. ‘అత్తారింటికి దారేది’లో నదియాగారు పోషించిన పాత్ర చూసి ఆమెతో ఈ తరహా పాత్ర చేయించడం కరెక్టేనా అనిపించింది. అయితే షూట్‌లో ఆమె అభినయం చూసి ఆ పాత్రతో ప్రేమలో పడిపోయా. అంత వేరియేషన్ ఊహించలేదని అన్నాడు.